సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాల సర్వతో ముఖాభివృద్ధి సాధించవచ్చునని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు.
పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు అంతా కలిసి ఒక్కచోట సమావేశమై పాఠశాల అభ్యుదయం కోసం చర్చించుకోవడం గొప్ప ఆరోగ్యకరమైన పరిణామమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రగతి సాధ్యమని ఆమె పిలుపునిచ్చారు. ఈనాటి కార్యక్రమంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఉండే తరగతి గదులకు వెళ్లి వారితో పాటు కూర్చొని ముచ్చటించుకున్నారు. ప్రభుత్వ విద్యా పథకాలను పథకాలను స్క్రీన్ పై వీక్షింప చేశారు. ఇవి చూసిన తల్లిదండ్రులు విద్యా కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో ఏ విధమైన ఆలోచనలతో అమలు చేస్తున్నారో అవగాహన పొందారు. అలాగే ఓపెన్ హౌస్ ఫోటో బూత్ లో ప్రతి తల్లి తండ్రి బిడ్డలు ఫోటోలు తీసుకొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులంతా పాఠశాల అభివృద్ధికి, విద్యార్ధుల్లో విద్యా స్థాయి మెరుగుదలకు ఉపాధ్యాయులతో పాటు నిరంతరము కృషి చేస్తామని ప్రతిజ్ఞ గావించారు. హాజరైన పలిశెట్టి పూజేశ్వరి, లోపింటి జీవన్ రావు, మొదలగు తల్లిదండ్రులంతా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సభా ప్రారంభానికి ముందు తల్లులందరికీ విద్యార్థులంతా పుష్పార్చన గావించి పాదాభివందనం గావించారు. అనంతరం జరిగిన సభలో అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఆర్.ఎల్.కుమారి, ముఖ్యఅతిథి సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ, గౌరవ అతిథులు మాజీ సర్పంచులు పలిశెట్టి సూర్యనారాయణ, పెద్ది భాస్కరరావు, విశిష్ట అతిథి గ్రామ పౌరులైన సీనియర్ ప్రజానేత పెద్ది సత్యనారాయణ, ప్రత్యేక ఆహ్వానితులు సచివాలయ విద్యా సంక్షేమ కార్యదర్శి ఆరెళ్ళ వేణుగోపాలరావు, గౌరవ ఆహ్వానితులు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ చాంతాటి లక్ష్మి, వైస్ చైర్మన్ డొప్ప శ్రీను, స్థానిక ప్రజానేతలు దారబోయిన వెంకట అప్పారావు, గర్లంకి శ్రీనివాసరావు, వెంపల శివకుమార్, పి.శ్రీనివాసరావు, కె.సీతారాం, లోపింటి జీవన్ రావు, అలజంగి అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు కుప్పిలి లక్ష్మి, ఉరిటి సౌజన్య, కె.శాంతి, బాలబడి బోధకురాలు దారబోయిన జ్యోతి తదితరులు ప్రసంగించారు. వైద్య ఆరోగ్య శాఖా ఉద్యోగులు జి.భాస్కరరావు, కె.మంగమ్మ, బి.ఈశ్వరమ్మ, ఆశ కార్యకర్త ఎ.కుమారిలు పాల్గొని అవసరమగు వైద్య సేవలనందించారు. అనంతరం విద్యార్థి సయ్యద్ జుబేర్ తల్లికి వందనం కవితను వినిపించి అందరి ప్రశంసలు పొందాడు. విద్యార్ధినులు బత్తుల లిఖిత, డొప్ప యామిని కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగులో మరియు ఇంగ్లీష్ లో ప్రసంగించారు. పిల్లల విజయలలిత చక్కని గీతాన్ని ఆలపించి అందరి ప్రశంసలు పొందింది. నృత్యరూపకాలను చిన్నారులైన కొర్నాన సునీత, తోపల సునంద, సిరిపురం హేమ, పిల్లల లావణ్య, గుంటుపాని పూజ, డొప్ప రాజేశ్వరి చిర్రా అమృత ప్రదర్శించి కార్యక్రమాన్ని రంజింపజేసారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు సైబరాసుల వల, డ్రగ్స్ రహిత సమాజం అనే స్వీయ కవితలను వినిపించారు.
ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్ పోటీలలో విజేతలైన అలజంగి అరుణ, రాజమహేంద్రవరపు స్వాతి, చిర్రా ఢిల్లేశ్వరి, లోపింటి స్వప్న తదితరులకు
ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యు.ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేసారు. మిఠాయిలు పంచుకుని ఆనందంగా కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి