పగలనక రేయనక
ఎండనక వాననక
కరడు గట్టిన చలిలో
కట్టుకున్న వారిని
కన్నతల్లితండ్రులను వదలి
దేశ రక్షణయే ధ్యేయంగా
అహర్నిశలు పని చేసే త్యాగధనులు
పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజల
ప్రాణాలను కుటుంబ సభ్యుల ఎదుటే
అతి కిరాతకంగా హతమార్చిన నలుగురు నరరూప రాక్షసులను
రెండునెలలు అవిశ్రాంతంగా
జమ్మూ కాశ్మీర్ లోని దుర్భేద్యమైన ప్రదేశంలో
మాహాదేవ్ కొండ సమీపంలో
ఉగ్రవాదుల ఉనికిని భద్రతా దళాలు కనిపెట్టి
ప్రాణాలను ఫణంగా పెట్టి
వీరోచితంగా జరిపిన కాల్పులలో ముగ్గురు ముష్కరులను
సైనికులు "ఆపరేషన్ మహాదేవ్" పేరిట
హతమార్చి వీరాశివాజీ, అల్లూరి రాణాప్రతాప్ వారసులమని
వసుదైకానికే చాటిన
మీ దేశభక్తికివే అందిస్తున్న
నా అక్షర నీరాజనాలు..!!
...........................
ఆపరేషన్ మహాదేవ్:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి