నేలను పొడుచుకొచ్చిన
విత్తనం
రూపాంతర శోభ ఆకుపచ్చ గూడు
నిటారుగా భూమిలో పందిరి
వేళ్ళు
చీకటిని చీల్చే జీవాంతరభాష నోళ్ళు
నాలుక ఒకటే
విశ్వరుచులన్నీ చుట్టాలే
క్రతువులో
గాలి కోపతాపాల గెలిచే జపతపాలు
మూకీ టాకీల నడుమ
కళాత్మకం అక్షరమే ప్రపంచంలో
ఎక్కడ ఎప్పుడు పొడిచినా
పాలి మొనల పారే రచన
అక్షరావరణంలో
అద్భుత అమేయ నిస్వార్థ సృజన
సామాజిక కొలిమి సెగలూదే అక్షర బీజం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి