నింగిని వెలిగే దీపం కోసం
నిండుగ ఇచ్చే దీవెన కోసం
పండుగ తెచ్చే వేకువ కోసం
పండే కలల వేడుక కోసం....
తూరుపు తలుపు తెరచి
మెరుపులు కన్నుల నింపి
మరువగ లేని ముచ్చటలెన్నో
మురిపము తీరగ పంచే పొద్దుకై....
తగిలిన గాయం మానిపోగా
విరిగిన మనసులు కలిసిపోగా
తలవని వరములు కురిపిస్తూ
వదలక ముందుకు నడిపించే...
కలతల మబ్బుల వెనుక దాగిన
వెలుతురు దివ్వెలు వెలిగిస్తూ
కొలిచిన హృదయాన కొలువు చేయగా
కదిలొచ్చే కనక కలశము....
ఒలికించే కాంతిధారలు
చిలికించే బంగరు వెలుగులు
పలికించే ఉదయారాగాలకు
తలవంచి ప్రణమిల్లే హృదయాలకు
కనిపించే దైవంగా
కరుణించే అనుగ్రహంగా
కలవరించే నయనాలను
నిలువరించే నిమిషానికి
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి