కలం కాదు అది వెలిగే కాగడా...గర్జించే ప్రళయగళం ఆయన శ్వాస...గర్వించే కొండంతగుండె ధైర్యం...అంబేద్కర్ సొంతం..!ఆత్మ విశ్వాసం...ఆత్మ బలం...ఆత్మ గౌరవం...ఆత్మాభిమానం...ఆర్జించడం...అనుభవించడం...హక్కులకోసం...అవిశ్రాంత పోరు..అంబేద్కర్ జీవిత ఆశయాలు...!గన్నుతో కాదు...పెన్నుతోప్రశ్నించడం నేర్పినవాడు...బెదిరింపుల చెరసాలలోనూవెనకడుగు వేయని "చిరుతపులి"..!నిత్యం ఉద్యమంగాఉదయించినవాడు...సత్యబోధనగా మారినవాడు...సమరానికి సైఅనే బహుజనులనుబాహుబలులుగా మార్చినవాడు...కట్టుబాట్లపై మూఢత్వంపైకలంకత్తిని విసిరిన..."మహాయోధుడు"..!"అంటరానితనాన్ని""చట్టంఅగ్నికి ఆహుతిచేసిన"కులమనే విషవృక్షాన్ని""కూకటి వేళ్లతో సహా"పెకలించాలని" కలలుగన్న"విప్లవ వీరుడు...ఉద్యమకారుడు"..!ఆయన కల...రాజ్యాంగ రచనఆయన ఆశ...రాజ్యాధికార సాధన..!అక్షరం ఆయన...అణ్వాయుధం...కలం ఆయన...చేతిలో వెలిగే కాగడా..!ఆత్మవిశ్వాసం...ఆయనకు ఆక్సిజన్...ఆత్మగౌరవం......ఆయన రక్షణ కవచం...సమసమాజం...ఆయన సిద్ధాంతం...నవభారత నిర్మాణం...ఆయన ధ్యేయం..!ఆయన ఎవరు...? ఇంకెవరు..?జ్ఞాన జ్వాలలతోభగభగ...మండే సూర్యుడు...నింగిలో ధగధగ...మెరిసే నక్షత్రం...తరతరాల అవమానాల అగ్నికిదహించుకుపోయిన దళితులకుదారి చూపిన...ఓ దీపస్థంభం...వెలుగులు పంచిన...ఓ కాంతికిరణం...!అణగారిన వారికి...ఆత్మ బంధువు...తాడితులకు....చైతన్య గీతం...పీడితులకు......శాంతికపోతం...బహుజనులకు...వెయ్యేనుగుల బలం..!స్పూర్తి ప్రదాత...రాజ్యాంగ నిర్మాత...భారతరత్న...బోధిసత్వ...అందరివాడు...ఆరనిజ్యోతి...అమరజీవి డా.బాబాసాహెబ్ అంబేద్కర్.
కలం కాదు అది...కాగడా..!:- కవి రత్న-సాహిత్యధీర సహస్రకవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి