పెళ్లి సందడి:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రాళ్లు కొట్టే రామయ్య 
రోల్లు నీవు చేస్తావా
పల్లెకు నీవు వస్తావా
చెల్లె రోలు చూస్తుంది 

ఇంటిలో రోలు పెట్టయ్యా 
సోలెడు బియ్యమిస్తాను
చారెడు పప్పు పెడతాను
కొంత రొక్కము ఇస్తాను 

కమ్మరి కనకయ్య నీవు 
పెళ్లికి కుందేన తెస్తావా 
పెళ్లి కూతురు చూస్తుంది 
పైసలు నీకు ఇస్తుంది 

వడ్ల మల్లయ్య వస్తావా 
పొన్ను రోకలి తెస్తావా 
పచ్చని పందిట్లో పెడతావా 
వంద రూపాయలు ఇస్తాను

గంగమ్మ ఇంటికి నీవొస్తావా
రంగుల గాజులు తెస్తావా
పడుతులందరు వస్తారు 
పదిలంగ గాజులు వేస్తారు 

ప్రేమతో మీరంతా రారండి 
పెళ్లి సందడిని చూడండి 
మల్లెల మాలలు వేయండి 
మనసార మీరు దీవించండి 


కామెంట్‌లు