ఎదుట నిలిచిన దేవుని
ఎదలో దాచిన రేవుకు
ఎంత కమ్మని క్షణమో
ఎన్ని జన్మల పుణ్యమో!
ఒక్కొక్క బిందువుకు
ఒక్కొక్క సూర్యుడైనట్టు
ఏటి లోని నీటి చుక్కలన్నీ
మురిసి ముక్కలై పోయే!
చెదిరి కదలగ కొంచెం తాను
బెదిరి వదలిపోవునేమోనని
అదిరిపోయి అటులే నిలిచే
ముదిరిపోగా ఆశ పట్టి నిలుప!
గుప్పెడు గుండెలో దాచిన
కొండంత ప్రేమను చూప
వంగి చూచు నింగిని పిలిచి
రంగుల కిరణపు హంగును చూపే!
రంగవల్లులు దిద్దిన రహదారిలోన
ఊరేగు స్వామిని స్వాగతించ
ఊరే కోరికల వేచిన మేఘమాల
ఊసూరనియె నీట బంగరు మూట చూచి!
ఎదిగి భానుడు ఎదర
వెలుగులు పంచగా
ఆకసము అవని కలిసి
ఆనందమున ఒకటి కాదా?!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి