(మద్యం మాయలేడితో అక్రమసంబంధం)
మద్యం మాయలేడి
వలలో చిక్కిన కూలీవాడు…
పచ్చని చెట్టులా ఒరిగిపోతాడు...
నిశ్శబ్దంగా గోడలా విరిగిపోతాడు…
రోగాలతో రొస్టులతో కూలిపోతాడు...
తెగిన గాలిపటంలా నేల రాలిపోతాడు...
వాడిమీద దయ జాలి
కరుణ కనికరం ఎవరికి..?
తన శరీరాన్ని అమ్మే
మద్యం దుకాణదారునికి తప్ప...
ఆలి తాళి తాకట్టు పెట్టుకుని
అప్పిచ్చే అప్పారావుకు తప్ప...
వాడి కళ్ళు ఎప్పుడూ
ఆ మూడుముళ్ళ పసుపుతాడు మీదే...
తాకట్టు పెట్టాలని..పీకలదాకా త్రాగాలని...
ఆలి మీద జాలి లేని జన్మ...అది ఏల..?
పుట్టిన పిల్లలకు పూర్వజన్మ శాపమిదియే...
మద్యం మత్తులో మునిగి తేలేవారు...
మూర్ఖులే... వ్యసనపరులే...వ్యాధిగ్రస్తులే...
ఋణగ్రస్తులే...బాధ్యతలేని బద్దకస్తులే...
మృత్యువుకు మద్యం...మూర్ఖుల ప్రాణాలే
వద్దు...వద్దు...త్రాగవద్దు...
తనువును తాకట్టు పెట్టవద్దు...
కుటుంబాన్ని కుప్ప కూల్చవద్దు...
ఆలిని ఆకలి అగ్నిలో కాల్చవద్దు...
బంగారు బ్రతుకును బలి చేసుకోవద్దు...
మద్యం మాయలేడితో
వద్దు...అక్రమ సంబంధాలు …
అవి జీవితాలను బుగ్గిచేసే అగ్నిబాణాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి