తమ పాఠశాల నుండి గతనెల బదిలీ కాబడిన పదిమంది ఉపాధ్యాయులకు వారి సేవలను కొనియాడుతూ వీడ్కోలు పలుకుతూ సన్మానించామని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన బదిలీ టీచర్ల ఆత్మీయ సత్కార సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత ఎనిమిదేళ్లుగా పనిచేస్తూ బదిలీ అయిన ఉపాధ్యాయులు ఇందులో సగం మంది ఉన్నారని, మొత్తం పదిమందీ ఆదర్శవంతమైన బోధనలతో ఉపాధ్యాయ వ్యవస్థకు వన్నె తెచ్చారని అభినందించారు. బదిలీ అయిన బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు తూతిక సురేష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయని దార జ్యోతి, సాంఘిక శాస్త్రోపాధ్యాయని బండారు గాయత్రి, తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్మునాయుడు, ఆంగ్ల ఉపాధ్యాయని శివకల శ్రీవాణి, హిందీ ఉపాధ్యాయని బత్తుల వినీల, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, తెలుగు ఉపాధ్యాయని కింజరాపు నిర్మలాదేవి, హిందీ ఉపాధ్యాయులు బోనెల కిరణ్ కుమార్ లను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చం, కానుకలతో ఘనంగా సన్మానించారు.
వీరంతా వివిధ మండలాల్లో గల మరువాడ, పాలకొండ, కురిగాం, నరిసిపురం, మాతల, రుషింగి, పెదలోగిడి, పాలఖండ్యాం, టెక్కలి, యు.కె.గుమడ పాఠశాలల్లో నియామకం పొంది, నేడు ఈ అభినందన సభకు హాజరై సత్కారం పొందారు. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహోపాధ్యాయులు బొమ్మాళి వెంకటరమణ, పెయ్యల రాజశేఖరం, జక్కర వెంకటరావు, పడాల సునీల్, ముదిల శంకరరావు, యెన్ని రామకృష్ణ, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, మాచర్ల గీత, మజ్జి శంకరరావు, వసంత రాజారావు, జి.నరేష్ రామ్ జీ, యందవ నరేంద్ర కుమార్, బోధనేతర సిబ్బంది సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రసంగించి సన్మానించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి