ముందు బ్రతుకుందో లేదో
గతమంతా కన్నీటి మయమే
కడుపు నింపుకోవడానికి
వేల మైళ్ళ ప్రయాణం
కాశీకి వెళ్ళిన కాకి
కాటికన్నట్టు
ఊరు మొకం చూస్తమోలేదో
బిగ్గరగా ఏడ్చే స్తున్న పిల్లాపాపలనిడిసి
గుండె రాయి చేసుకొని
దుఃఖం ఉబికి వస్తున్న ఉగ్గబట్టుకొని
త్వరగా వస్తానమ్మా
నేనెక్కడికెళ్తున్నాను
గీ హైదరాబాదే
మీరెప్పుడు రమ్మంటే
నేనప్పుడూ వస్తాను
అంటూ
భారంగా అడుగులుముందుకేస్తూ
దేశం కానీ దేశం
విదేశం
వెళ్లిపోతున్నాను
మా బ్రతుకున కమ్ముకున్న దుఃఖమేఘం దూరమై
ఆనందపు హర్షాతిరేకాలు
నిండాలని
కొండంత ఆశతో
బ్రతుకు పోరుకై...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి