బోనాలు గీతం:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) @ వెలగలేరు
 ప:
ఆషాడం చెప్పింది… అంబనే పూజించమని
బోనాలను ఇవ్వండని పిలుపుతో వచ్చేసింది
॥ఆషాడం॥
1చ:
మట్టి కుండలో నైనా… రాగి పాత్రలో నైనా
కడుపార భోజనమే కడవలతో తెమ్మంది
దద్ధ్యన్నము గుఢముతో… ఉల్లి నివేదించగా
దయగల తల్లీ… మనలను చల్లగ దీవిస్తుందని
॥ఆషాడం॥
2చ:
పోతురాజు ఆటలతో… డప్పుల సవ్వడులతో…
పసుపు కుంకుమలద్దిన బోనాలను జ్యోతులతో…
తలకెత్తిన మహిళలంత భక్తితో తరలిరాగ 
కరుణించును కాత్యాయనీ… కమనీయ రూపముతో…
॥ఆషాడం॥
3చ:
మైసమ్మ… మారెమ్మ… పోచమ్మ… పెద్దమ్మ
డొక్కాలమ్మ… అంకాలమ్మ… పోలేరమ్మ… ఎల్లమ్మ
రూపాలెన్నైనా… నామాలేవేవైనా…
పాపాలను తొలగించగ పరమేశ్వరి విచ్చేసి
పరమ పదము ప్రసాదించి…సద్గతులనిచ్చునని…
॥ఆషాడం॥

కామెంట్‌లు