కృతజ్ఞత:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
పుట్టిన పసికందుకు మరొకటి తెలియదు
ఆకలి వేసినప్పుడు పాలను తాగటం తప్ప
అనుభవజ్ఞులైన అమ్మమ్మో… నానమ్మో లేక
అమ్మో నోటికి అందిస్తేనే అదైనా సాధ్యం!

ఇలా… శైశవంలో ప్రారంభమైన నేర్చుకోవటం
బాల్యంలో విద్యా సముపార్జనకై
జ్ఞాననిధి అయిన గురువును ఆశ్రయించి
సామ… దాన…భేద దండోపాయాలతో
ఎదుగుతాడు సుశిక్షితుడుగా…!

జీవిత పర్యంతం తప్పదని గ్రహించిన
మనిషి
అజ్ఞానం తిమిరాన్ని తొలగించి
వెలుగును ప్రసరింప చేసే
సరైన గురువు చెంతచేరి
సత్యాన్వేషిగా సఫలీకృతుడై
ప్రశాంత చిత్తంతో చాలిస్తాడు
నిత్య విద్యార్థిగా తన తనువు జీవితం!
కృతజ్ఞతాభివందనములతో పొందుతాడు
గురముఖతః తెలుసుకున్న
శాశ్వత సురక్షిత స్థానం!


కామెంట్‌లు