'అచ్చుల భక్తి గేయం' :- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
  అమ్మలగన్న అమ్మవు నీవమ్మా 
ఆది పరాశక్తికి ఆకృతి నీవమ్మా 
ఇలలో వెలిసిన దైవము నీవమ్మా 
ఈశుని గెలిచిన పరమేశ్వరి నీవమ్మా 
ఉత్తమ గతులనొసంగే దేవివి నీవమ్మా 
ఊహాజనిత సౌందర్యలహరివి నీవమ్మా 
ఋజువర్తన నేర్పే మా తల్లివి నీవమ్మా 
ౠకలనీయగ వెలిసిన ధాత్రివి నీవమ్మా 
ఎల్లలు లేని భక్తికి లొంగే స్మృతివీ నీవమ్మా 
ఏలికగా వచ్చిన మహాసామ్రాజ్ఞివి నీవమ్మా ఐశ్వర్యములిచ్చెడి శ్రీచక్ర వాసిని నీవమ్మా 
ఒక పరి తలచిన ధైర్యమునిచ్చే ధర్మము నీవమ్మా ఓంకారమందు ధ్వనించే నాదము నీవమ్మా 
ఔరా! యని మా గుండె సడిన నిను దర్శించేమమ్మా అంబరమంటిన సంబరమీయగ రావమ్మా 
 (ఆః)ఆహా! నీ రూపముగాంచెడి భాగ్యము మాదమ్మా 

కామెంట్‌లు