7 అడుగులు...పెళ్లికి..! 7 మెట్లు...పచ్చని కాపురానికి..!!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఓ నూతన వధూవరులారా…!
మీ మనసైన కాపురం ఎల్లవేళలా
మల్లెపూల పరిమళాలు వెదజల్లుతూ
చిరునవ్వుల వర్షం కురిపించాలని 
కోరుకుంటూ…
7 అడుగులు వేసిన
మీకు...మీ పచ్చని కాపురానికి...
మీ అనురాగ గోపురానికి ఇవిగో 7 మెట్లు..!

1 వ మెట్టు…
ముఖాముఖి
చర్చలే మనస్పర్ధలకు
మందులని మరువకండి..!

2 వ మెట్టు…
పరస్పర గౌరవమే
బంధాలకు ఆధారం…
ప్రేమ సీతాకోకచిలుకలా
ఎగిరిపోకుండా జాగ్రత్తపడండి…
మల్లెపూల పరిమళాలతో మీ
దాంపత్య బంధాన్ని నింపుకోండి..!

3 వ మెట్టు…
మూడోవ్యక్తి మాటల
వలలో చిక్కుకుపోకండి…
ప్రేమ పుష్పం ఎండిపోతుంది…
అనురాగ దీపం ఆరిపోతుంది..!

4 వ మెట్టు…
కడుపులో కక్ష…గుండెలో పగను
విషపు విత్తనాల్లా నాటుకోకండి…
చెట్టుకులతలా బంధాలు
బంగారు హారాలై ముడిపడిన
సంసార సౌభాగ్య సౌరభాన్ని
సంపూర్ణంగా ఆస్వాదించండి..!

5 వ మెట్టు…
మీ నిర్మల నిశ్చల
నిష్కల్మష మనసును...
అపార్థాల అగ్నితో మసిచేయకండి…
అనుమానాల విషంతో నింపుకోకండి...
గౌరవం – ప్రేమ అనే రెండురెక్కలతో
దాంపత్య పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి.!

6 వ మెట్టు…
గతంలో వేధించిన గాయాల
గాలిపటాలను ఎగురవేయకండి…
కోపం...కసి రగిలినా
పరుష పదబాణాలను సంధించకండి…
పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకోకండి..!

7 వ మెట్టు…
చింతలూ చీకాకులూ దూరమై
నవ్వుతూ కడవరకు కలిసి నడవండి…
చిలకా గోరింకల్లా చిరకాలం జీవించండి..!

================



కామెంట్‌లు