ఒక ఊరిలో కాంతం మానే ముసలావిడ నివసిస్తూ ఉండేది.ఆమెకు ఎవరూ లేకపోవడం వలన బిచ్చమెత్తుకుంటూ బతికేది.ఒకరోజు ఆమె చెత్తకుప్ప దగ్గర వెతుకుతుండగా చిన్న పిల్లల ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూస్తే ఒక అందమైన బాలుడు చెత్త కుప్పలో ఉన్నాడు.చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కాంతమ్మ ఎంతో బాధపడి ఆ బాలుడిని తీసుకొని ఇంటికి వెళ్ళింది.శుభ్రంగా స్నానం చేపించింది.ఎవరైనా వస్తారేమో వాళ్లకు ఇద్దామని చూసింది.కానీ చాలా రోజుల వరకు ఎవరూ రాలేదు.కాంతమ్మ బిక్షాటన చేసుకుంటూ పెంచసాగింది.పాఠశాలకు వెళ్లే వయసు రాగానే పాఠశాలకు పంపించింది. ఎవరూ లేరని ఆలోచన రాకుండా చూసుకునేది.ఆ అబ్బాయి కూడా బడిలో చక్కగా చదువుకుంటూ ఉండేవాడు.కాంతమ్మ ఏనాడు ఆ బాలునికి చిన్న కష్టం రాకుండా చూసుకో సాగింది.వయసు మీద పడుతున్న కొద్ది కాంతమ్మకు ఒకటే బాధ.పెద్దగా అయిన తర్వాత ఈ బాలుని పరిస్థితి ఏమిటి అని.కానీ ఆ బాలుడు కష్టపడి చదువుతూ ఉపాధ్యాయుల మెప్పును పొందేవాడు. కొద్ది రోజులకు కాంతమ్మ శ్రమ,రాము కష్ట ఫలితంగా ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉండడం వల్ల ఒక కలిగిన కుటుంబం అతనికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకుంటారు. వివాహం ఉన్నంతలో జరిపిస్తారు.కొత్త కాపురం మొదలుపెట్టారు.రాము భార్యకు కాంతమ్మ వాళ్లతో ఉండడం అసలు ఇష్టం లేదు. ఆమెను సరిగా చూసుకునేది కాదు.ఆమెను సూటిపోటి మాటలతో ఎప్పుడు బాధపెట్టేది.కానీ కాంతమ్మ ఆ విషయాన్ని ఎప్పుడు రామకు చెప్పలేదు.ఎందుకంటే అతడు అనాధ బాలుడు తనకే కష్టం రాకుండా కుండా పెంచింది.ఇప్పుడు కోడలు తనను మంచిగా చూసుకో లేదని చెప్తే బాధపడుతాడని చెప్పలేదు.కానీ రాము ఈ విషయాన్ని తొందర్లోనే కనిపెట్టాడు. భార్యను కోప్పడ్డాడు.ఆమె అలిగి వారి అమ్మగారింటికి వెళ్ళింది.తల్లిదండ్రులు ఆమెను విషయం అడిగారు కానీ చెప్పలేదు.తర్వాత రాము ద్వారా అసలు విషయం తెలుసుకున్న వాళ్ళ అన్న,నాన్న చిన్న నాటకమాడి ఆమెకు జ్ఞానోదయం కలిగించారు.వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయిందని హాస్పటల్లో ఉన్నాడని,ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం కంటే నీ భర్త దగ్గరికి పోవడం మంచిదని చెబుతారు.నాన్నకు గాయమైన నేను ఇక్కడే ఉంటాను. అక్కడికి వెళ్ళను అని అంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య నాన్నకు గాయమైనా ఇక్కడే ఉండి ఇబ్బంది పెడతానని అంటున్నావు.మరి అక్కడ వృద్ధురాలైన మీ అత్తమ్మను ఎందుకు బాగా చూసుకోలేకపోతున్నావు.అప్పుడు ఆమెలో ఆలోచన మొదలైంది. కాంతమ్మ వల్లనే రాము చదువుకున్నాడని, ఉద్యోగం చేసుకుంటున్నారని,తనను వివాహం చేసుకున్నారని అర్థం చేసుకుంటుంది. తను తప్పు తెలుసుకుని భర్త దగ్గరికి వెళుతుంది.కాంతమ్మ చాలా సంతోషిస్తుంది.తనను కన్న కూతురిలా చూసుకుంటుంది.
కాంతమ్మ కథ:- డి.రోహిత్-7వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి