నాన్న మనసు:- --గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
వెండి, బంగారం కన్న
నాన్న గారి మనసు మిన్న
వారు లేక సదనంలో
ఏది ఉన్న గుండు సున్న

ప్రేమకు ప్రతిరూపం నాన్న
నిర్లక్ష్యం చేయరాదోయ్
వారి మనసు చూడ వెన్న
కష్టబెట్టకూడదోయ్

ప్రేమానురాగాల కొండ
కుటుంబానికి కడు అండ
కనిపించే భగవంతుడు
నాన్న అనిన త్యాగధనుడు

నాన్న మనసు మెత్తదనం
వారికి మించినదేది!
లేదు లేదు పరికించుము
సృష్టిలోన సాటి ఏది!


కామెంట్‌లు