అమ్మ నాన్నల ఆశయాలు:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
అమ్మ మనసు వెన్నర 
వెన్న ముట్టి చూడరా
చిన్నగా కరుగుతుంది 
అదే నిజం రా కన్నా 

నాన్న  హృదయం తేనరా
తేన నీవు తాగి చూడరా
నీ నోరు ఊరుతుందిరా 
దాని తీపి అమృతమురా

అమ్మ చెప్పే  మంచి మాటలు 
బ్రతుకు లో పూల బాటలో 
పువ్వుల బాటలో నడవరా 
రివ్వున నీవు  పైపైకి ఎగురురా 

అమ్మానాన్నల ఆశయాలు 
నిమ్మలంగా గమనించురా 
కమ్మనైన కలలతోటి
చెమ్మగిల్లు నేమో నీ కళ్ళు 


కామెంట్‌లు