రాజేశ్ ఎప్పుడూ మార్కులలో క్లాస్ ఫస్ట్ వస్తాడు. అందుకే రాజేశ్ ఆ క్లాస్ లీడర్. సురేశ్ ఎప్పుడూ అంతంత మార్కులే తెచ్చుకునేవాడు. సురేశ్ తల్లిదండ్రులతో చివాట్లు తినేవాడు. రాజేశుతో పోల్చి తల్లిదండ్రులు సురేశుని తిట్టేవారు. అందుకే సురేశుకి రాజేశ్ మీద కుళ్ళు, కోపం ఉండేవి.
సురేశ్ క్యారమ్స్ ఆటలో ఛాంపియన్. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్యారమ్స్ పోటీలు జరుగుతున్నాయి. అందులో సురేశ్ ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత ఖాళీ సమయంలో సురేశ్ రాజేశుని తనతో క్యారమ్స్ ఆడమని పిలిచాడు. రాజేశ్ చిత్తుగా ఓడిపోతున్నాడు. సురేశ్ ఆపకుండా మళ్ళీ మళ్ళీ రాజేశును క్యారమ్ ఆటకు పిలిచి, అతణ్ణి ఓడిస్తున్నాడు.
ఆ తర్వాత రాజేశ్ తన మిత్రులతో "చదువులో ఫస్ట్ అని మురిసిపోతున్న రాజేశ్ ఆటలో నా ముందు చిత్తు.అంటూ పగలబడి నవ్వాడు. రాజేశ్ మిత్రుడు సతీశ్, "రాజేశ్! చదువులో నువ్వు రాజువి. అలాంటి నువ్వు నీకు రాని ఆటను ఇంకొకరితో ఆడి నువ్వు ఓడిపోవడం నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుని ఒక మొద్దు చేతిలో ఓడిపోతున్నావు?" అన్నాడు. "నేను ఓడిపోవడం అవమానంగా తీసుకోవడం లేదు. ఒక ఛాంపియనుతో మళ్ళీ మళ్ళీ ఆడి, నా ఆటను మెరుగు పరుచుకోవాలని అనుకుంటున్నా. సురేశ్ ఎలా ఆడుతున్నాడో గమనిస్తూ నేనూ నేర్చుకుంటున్నాను. సురేశ్ నాకు గురువు." అన్నాడు రాజేశ్. ఈ మాటలు సతీశ్ సురేశుతో చెప్పాడు. సురేశ్ సిగ్గుతో తల దించుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి