జీవితం!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
జీవితమంటే 
గమ్యం లక్ష్యం కాదు! 
జీవితమంటే 
జయాపజయాలు కాదు!!

జీవితమంటే 
ప్రయాణము కాదు 
జీవితమంటే 
పర్ఫెక్షన్ కాదు!!

జీవితమంటే 
మన ఊరికి మనం వెళ్లడం కాదు 
జీవితమంటే 
మన చుట్టూ ఉన్న ఊర్లకు వెళ్ళటం!!

జీవితమంటే 
మనం జీవించటం కాదు 
జీవితమంటే 
మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జీవించటం.!!

జీవితమంటే 
స్వార్థము నిస్వార్థము కాదు 
జీవితమంటే 
అర్థము కాదు అర్థము లేదు!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు