గిడుగు గొప్ప గొడుగు..!:- కవి రత్న -సాహిత్య ధీర -పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
గిడుగు అంటే ఎవరు..?
తెలుగు జాతి ప్రాణం – మన గిడుగు..!
తెలుగుకు వెలుగునిచ్చిన
అరుణోదయ సూర్యుడు – మన గిడుగు..!

గిడుగు అంటే ఎవరు..?
తెలుగు తెరమరుగు కాకుండా
గురజాడ సహచర్యంతో
అగ్నిజ్యోతి వెలిగించిన
కాంతి కాగడా – మన గిడుగు..!

గిడుగు అంటే ఎవరు..?
పరభాషా వ్యామోహంపై
పడిన పిడుగు – మన గిడుగు..!
తెలుగుపై ఆ పిడుగు పడకముందే
ఒక అఖంఢ జ్ఞాన శిఖరంలా
అడ్డపడిన గొప్ప గొడుగు – మన గిడుగు..!

అడుగు అడుగు 
మన గిడుగును అడుగు...
తెలుగంటే మీ ఎందుకింత పిచ్చని..?
పరభాషలెందుకు మీకు నచ్చవని..?
గిడుగు సమాధానం ఒక్కటే...

"తెలుగు నా ఊపిరి..!
"తెలుగు నా కన్నతల్లి..!
"ఆ తల్లిరుణం తీర్చుకోవడమే
"నా ఈ తపన... నా ఈ తపస్సు..!”



కామెంట్‌లు