నింగిని వెలిగే సిరిదీపం
బంగరు కాంతుల మణి దీపం
ఆవల తీరాలు దాటుకుని
అవనికి వచ్చే దైవానికి ప్రతిరూపం!
ఎదురుచూసే జగతికి
ఎదురులేని మహోదయం
ఎదురుగా నిలిచిన పాదాల
ఎలమి సిరిమువ్వల నాదం!
జాగృత విహాంగాల
కువకువల సడులన్నీ
బాల భానుడు పలికే
సిరి పలుకుల సవ్వడులే!
అంతటా అలముకునే
అందమైన వెలుగులన్నీ
అంతర్యామి అనుగ్రహపు
అవధిలేని సిరిసంపదలే!
కిరణాల స్పర్శకు విరిసిన
కుసుమాల సౌరభాల
సిరికులుకుల సంచారం
భువనానికి తెచ్చే వసంతం!
మనోహరమైన దృశ్యాల
సుందర ఆవిష్కారాలతో
మనోరంజక అనుభూతుల నిచ్చే
అరుణోదయానికి సిరిజోతలు!
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి