శ్రావణి 10వ తరగతి చదువుతున్నది. చిన్నప్పటి నుంచీ తనతో కలసి చదువుతున్న మిత్రులు కలిసి ఉండేది ఈ ఒక్క సంవత్సరమే. ఇంటర్మీడియేటులో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తారో చెప్పడం కష్టం. అందుకే ఈసారి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అనుకుంది. తన మిత్రులను పుట్టినరోజు వేడుకలకు ఇంటికి ఆహ్వానించింది.
శ్రావణి తన పుట్టినరోజు నాడు కూడా పాఠశాలకు వచ్చింది. తన తరగతి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుల అందరికీ పండ్లు పంచి పెట్టింది. సాయంత్రం ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యలో వర్షం మొదలైంది. శ్రావణి ఇల్లు పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఉంది. వర్షం ఎంతకీ తగ్గఢం లేదు. శ్రావణి ఒక గుడిలో తల దాచుకుంది. శ్రావణితో పాటు శివాని, శ్రుతి కూడా ఉన్నారు. "అయ్యో! నీ పుట్టినరోజు ఎంతో ఘనంగా జరుపుకోవాలని అనుకుంటే ఈ వర్షం అడ్డు వచ్చింది?" అన్నది శ్రుతి. "శ్రావణికి వర్షం అంటే చాలా ఇష్టం. ఎంత జోరుగా వాన కురిస్తుంటే శ్రావణి ఆనందం అంతకంటే ఎక్కువ జోరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనందంతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేరుకుంటుంది." అన్నది శివాని.
"అవును. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. ఈ వర్షాలు బాగా కురిస్తే నదులు, చెరువులు నిండుతాయి. పంటలు బాగా పండుతాయి. అడవులు పచ్చదనంతో కళకళలాడుతాయి. అందుకే వర్షాకాలం అంతా నాకు సంతోషంగా ఉంటుంది. నా పుట్టినరోజు వేడుకలు ఈ వర్షాగమంతో జరగడం నాకు పండుగలా ఉంది." అన్నది శ్రావణి.
వర్షం కురిసీ కురిసీ అలసిపోయి ఆగిపోయింది. పిల్లలు ఇండ్లకు చేరినారు. ఆ రాత్రి శ్రావణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
పుట్టినరోజు వేడుకలు: - సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి