ఎవరికైనా సహాయం చేద్దాం మర్చిపోదాం.
ఎవరినైనా ప్రేమిద్దాం మర్చిపోదాం.
జీవితంలో ఏదైనా సాధిద్దాం మర్చిపోదాం.
జీవితంలో అవమానాలు ఎన్నైనా భరిద్దాం
మర్చిపోదాం.
విజయాలు ఎన్ని అయినా ఆనందిద్దాం మర్చిపోదాం.
డబ్బు ఎంతైనా సంపాదిద్దాం
ఖర్చు పెడతాం మర్చిపోదాం.
పేదరికం ఇంత భయంకరమైన భరిద్దాం మర్చిపోదాం.
ప్రతిభ ఎంత గొప్పదైన మామూలుగా తీసుకుందాం మర్చిపోదాం.
దేవుడు ఎంత గొప్పవాడైన ప్రార్థిద్దాం మర్చిపోదాం.
కానీ
మనం పుట్టిన లోకాన్ని
మనం సృష్టించిన లోకాన్ని
మనం ప్రేమించబడ్డ లోకాన్ని
మనపై ఆధారపడ్డ లోకాన్ని
మొట్టమొదట మనం గుర్తింపబడ్డ లోకాన్ని
మొట్టమొదట మనల్ని ప్రేమించిన లోకాన్ని
మొట్టమొదట మనకోసం నిర్మించబడ్డ గూడుని
జీవించబడ్డ జీవితాన్ని
మొట్టమొదట కళ్ళు తెరిచి చూసిన అమ్మలాంటి లోకాన్ని
అమ్మను భార్యను పిల్లలను మర్చిపోకూడదు.
మన ఉనికిని మన పునాదుల్ని మన లోకాన్ని మర్చిపోకూడదు.
మనం ఎంత శక్తివంతులమైనా కావచ్చు. కానీ అంత శక్తిని ఎదుర్కొనే వాడు పైవాడు వాడిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మలా భార్యను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.
మన కోసం పుట్టింది మనకోసం జీవించింది మనకోసం చనిపోయేది అమ్మ ఒక్కతే ఆ తర్వాత భార్య ఒక్కతే. ఆమెను మర్చిపోకూడదు.
ఆ గూడును ఆ నీడను ఆ ప్రేమను మర్చిపోకూడదు.
మీ చిన్ననాటి ప్రేమ అమ్మ భార్య నీకోసం ఎదురు చూస్తుంది. నిరీక్షిస్తుంది. ఆమెను ఎప్పుడూ మర్చిపోకూడదు.
మిత్రమా గుర్తుచేసుకో. మర్చిపోకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి