ఆ తరగతిలో ఎప్పుడూ మహేంద్ర క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. మహేంద్ర ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. అవతలి వాళ్ళు మాట్లాడినా పెద్దగా ప్రతిస్పందించడు. అందుకే అందరూ మహేంద్రకు పొగరు అనుకుంటారు. మహేంద్రకు చదువులో పోటీ లేదు.
అదే తరగతిలో శ్రీహరి అనే విద్యార్థి చదువుతుండేవాడు. శ్రీహరి చదువులో చాలా వెనుకబడేవాడు. మహేంద్ర శ్రీహరిని చాలా చులకనగా చూసేవాడు. శ్రీహరితో అసలే మాట్లాడకపోయేవాడు మహేంద్ర.
రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా మహేంద్ర తన పుట్టినరోజు వేడుకలకు తన తరగతిలో శ్రీహరిని ఒక్కడినే ఇంటికి ఆహ్వానించాడు. శ్రీహరి తాను రాను అంటున్నా పట్టు పట్టి శ్రీహరిని ఇంటికి తీసుకెళ్ళాడు మహేంద్ర. ఇన్నాళ్ళూ లేనిది తనకు ఒక్కడికి మాత్రమే ఇంత ప్రాధాన్యత ఏమిటో శ్రీహరికి అర్థం కాలేదు.
రోజు రోజుకీ మహేంద్ర శ్రీహరితో స్నేహం మరింత పెంచుకున్నాడు. ఖాళీ సమయంలో శ్రీహరిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయా సబ్జెక్టులలో అర్థం కాని విషయాలు వివరిస్తూ శ్రీహరిని తెలివిగల విద్యార్థిగా చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు మహేంద్ర. మహేంద్ర విరామం లేకుండా చేస్తున్న కృషి వల్ల శ్రీహరి తెలివైన విద్యార్థి అయ్యాడు. మరికొంత కాలానికి శ్రీహరి మహేంద్రతో సమానమైన తెలివైన విద్యార్థి అయ్యాడు. మహేంద్ర శ్రీహరిలు ప్రాణమిత్రులు అయ్యారు.
ప్రాణమిత్రులు వాసు, రామూలు క్యారమ్స్ ఆడుతున్నారు. "అవును వాసూ! శ్రీహరిని చాలా చులకన చూసే మహేంద్ర హఠాత్తుగా శ్రీహరితో స్నేహం చేయడం, ఆ తర్వాత పట్టుపట్టి శ్రీహరిని తనంత తెలివైన విద్యార్థిని చేయడం వింతగా ఉంది." అన్నాడు రాము. "శ్రీహరి చాలా పేద విద్యార్థి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఈ విషయం శ్రావణి ద్వారా మహేంద్రకు తెలిసింది. మహేంద్ర చాలా బాధపడ్డాడు. అందుకే మహేంద్ర శ్రీహరితో స్నేహం చేసి, శ్రీహరిని తనంత తెలివైన విద్యార్థిని చేశాడు. వారి స్నేహం జీవితాంతం కొనసాగుతుంది. శ్రీహరి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది." అన్నాడు వాసు. "మనలా వాళ్ళూ ప్రాణమిత్రులు." అన్నాడు రాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి