చిన్ని మల్లెపువ్వులో:- వరలక్ష్మి యనమండ్ర
పల్లవి
చిన్ని మల్లె పూవులో
పున్నమి జాబిల్లిలో
ఎటు చూసిన నీరూపే
కనిపించును  నా స్వామీ
 //చిన్ని//

చరణం 1
నీవు లేని చోటేమీ నేల మీద లేదులే
నీవుండని అణువేదీ నింగినసలు లేదులే//2//
ఎటు చూసినా నీరూపే 
ఓ సర్వాంతర్యామీ ...సర్వాంతర్యామీ...
// చిన్ని//

చరణం 2
మనసులోన నిను తలవని మనుషులసలు ఉంటారా
మరచియైన నిను వేడని మానవులుంటారా....
//మనసు//చిన్ని//

03
నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు
నీవు నేను ఒకటే యను నిజము తెలుసుకున్నాను
//నీవు//చిన్ని//

04
నీ మురళీ గానంతో నన్ను నేను మరిచేనురా
నా చెంతను నీవుంటే....... అదే కదా స్వర్గమంటాను
//నీ మురళీ//చిన్ని//

కామెంట్‌లు