పుట్టిన మరునాడే అమ్మను పోగొట్టుకున్న
నన్ను నష్ట జాతకుడని అందరు అన్న
నాన్నే అన్నీ తానై నన్ను పెంచి
తాను రేయింబవళ్ళు కష్టపడి
తినకున్నా లేకున్నా నా కడుపునింపి
దొంగలు ఎత్తుకు పోనిది చదువని
ఉన్నత చదువులు చెప్పించి
నన్ను ప్రయోజకుడిని చేసిన
తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాలని
అనుకుని తాను చెప్పిన అమ్మాయిని వివాహాం చేసుకుని
నా కిచ్చిన బంగాళాకు తీసుకెళ్లినపుడు
నాన్న కళ్ళలో చూసిన ఆనందం మరువకముందే
వచ్చినపని నెరవేరిందన్నట్లు
శ్రీరాముని దరిచేరిన పితృదేవుని
తలచుకుంటే ఇప్పటికీ ఏదో ఆవేదన...!!
.........................
ఏదో తెలియని ఆవేదన:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి