ఒకరోజు బాగా ఆకలిగా ఉన్న నక్క ఆహారం కోసం అడవి అంతా తిరిగింది, కానీ ఏమీ దొరకలేదు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. చివరకు మడుగులో నీళ్ళు తాగి, నీరసంగా ఒక చెట్టు కింద కూలబడింది.
చెట్టు కొమ్మలపై ఉన్న ఉడుత నక్కను చూసి కిందకు వచ్చింది. నక్క నాడిని పరీక్షించి, అది సొమ్మసిల్లిందని గ్రహించింది. వెంటనే మడుగులో మునిగి వచ్చి, తన కుచ్చు తోకతో నక్క ముఖంపై నీళ్ళు చిలకరించింది. నక్క కళ్ళు తెరిచేలోగా, ఉడుత తాను దాచుకున్న ధాన్యం గింజలు తెచ్చి ఇచ్చింది. నక్క ఆ గింజల్ని తిని, అవి చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంది.
"ఈ ఉడుతను మాయమాటలతో బురిడీ కొట్టించి, ఇక్కడే ఉండిపోవాలి. ప్రతిరోజూ ఆహారం వెతుక్కునే బాధనుండి బయట పడాలి" అని మనసులో అనుకుంది.
ఉడుత నక్కతో "మీరు ఇంత నీరసంగా ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగింది.
నక్క కన్నీళ్లు కార్చుతూ, తనకు ఒళ్ళంతా నొప్పని, అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉందని, దీనికి వారం రోజులు వైద్యం చేయించుకోవాలని అబద్ధం చెప్పింది. మూలికల కోసం ఇంత దూరం వచ్చానని, కానీ మూలికలు ఆకలి తీర్చలేవని ఏడ్చింది. ఉడుతకు జాలేసి,
"మీరు ఇక్కడే ఉండి వైద్యం చేసుకోండి, మీకు కావాల్సిన ఆహారం నేను తెచ్చిపెడతాను" అని మాట ఇచ్చింది.
నక్క తన పథకం పారిందని లోలోపల సంతోషించింది. నెలరోజులు గడిచినా నక్క రోగం తగ్గనట్లు నటిస్తూ మూలుగుతూనే ఉంది. నక్కకు సరిపడా ఆహారం తేవడం ఉడుతకు కష్టంగా మారింది, అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టపడింది.
ఒకరోజు ఉడుత గింజలు ఏరుకొని తిరిగి వస్తుండగా, తోటి నక్కలతో ఉల్లాసంగా ఊలవేస్తున్న నక్కను చూసింది. నెల రోజులుగా నక్క రోగం పేరుతో మోసం చేసిందని ఉడుత గ్రహించింది. దానికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
ఇంతలో జిరాఫీ అటువైపు వచ్చింది. ఉడుత జిరాఫీతో నక్క మోసం గురించి చెప్పి, దాన్ని వదిలించుకునే ఉపాయం చెప్పమని కోరింది. జిరాఫీ ఉడుత చెవిలో ఒక రహస్యం చెప్పి వెళ్ళిపోయింది. జిరాఫీ వెళ్ళగానే, నక్క మూలుగుతూ అక్కడికి వచ్చింది.
నక్క "జిరాఫీ నీకెలా తెలుసు?" అని అడిగింది.
ఉడుత "ఈ జిరాఫీ నా స్నేహితురాలు. తనకు వైద్యం బాగా తెలుసు. రోగలక్షణాలను బట్టి ఇది సోమరి రోగమని జిరాఫీ చెప్పింది. ఈ రోగానికి 'తొక్కుడు మందు' ఒక్కటే సరైన వైద్యం" అంది.
నక్క కంగారుగా "తొక్కుడు మందు అంటే...?" అని అడిగింది.
ఉడుత "నా మిత్రుడు జిరాఫీ దగ్గర నాలుగు బలమైన వేటకుక్కలు శిష్యరికం చేస్తున్నాయి. అవి నీ కాళ్ళను అదిమి పట్టుకుంటాయి. జిరాఫీ తన ముందు కాళ్ళతో పైకి లేచి నీ శరీరంలో నొప్పి ఉన్నచోట బలంగా తొక్కుతుంది. దెబ్బకు నీ రోగం ఠా! దీన్నే 'తొక్కుడు మందు' అంటారు" అని చెప్పింది.
తన నాటకం బయటపడిందని గ్రహించిన నక్క,
"నా రోగం తగ్గిపోయింది. ఇక వైద్యంతో పనిలేదు" అంటూ జారుకోవడానికి ప్రయత్నించింది.
అప్పుడు ఉడుత నక్కతో
"నక్క మామ! సోమరి రోగం తొక్కుడు మందుతో సరి! నమ్మిన వారిని ఎంతో కాలం మోసం చేయలేవని గుర్తుంచుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోమరితనాన్ని వదిలిపెట్టి, కష్టపడి పని చేయడం నేర్చుకో" అని హితవు పలికింది.
చేసిన తప్పుకు సిగ్గుపడిన నక్క, ఉడుతకు క్షమాపణ చెప్పింది. ఆనాటి నుండి నక్కకు మళ్ళీ 'సోమరి రోగం' రాలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి