సమాజాభివృద్ధి జరగాలంటే
బాల్యం నుంచి నైతికవిలువలతో కూడినవిద్య
ఈర్ష్య అసూయలు లేక
అనురాగ ఆప్యాయతలతో
చిరుమందహాసంతో పలకరింపు
అన్నార్తుల ఆకలితీర్చి ఆపదలోఉన్నవారికి ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకోవడం
చక్కటి ఆత్మీయ అనుబంధాలు
క్రమశిక్షణా జీవితం అలవరచుకోవాలి.
నేడు సమాజాన తల్లిదండ్రులను చూడక
తోబుట్టువుల మధ్య ఆస్థికోసం తగాదాలు
ఉమ్మడికుటుంబాలు పూర్తిగా పోయి
ఏకీకృత కుటుంబ వ్యవస్థ
నా చిన్ని బొజ్జకు నా శ్రీరామరక్ష అని ప్రవర్తించే తీరు.
వావి వరసలు లేని బంధాలు
మానవత్వం మరచి పశువులు కన్నా హీనంగా వ్యవహరించడం
స్త్రీ అర్ధరాత్రి కాదు పగలే ఒంటరిగా తిరుగులేని పరిస్థితులు
నైతిక విలువలు వదలి పెద్దలను గౌరవించక
కన్న పిల్లలను ప్రియుని మోజులో హతమార్చి మాతృత్వానికే కళంకం తెచ్చిన మాతృమూర్తి
అస్థి కొరకై తోబుట్టువులను
చివరకి తల్లిదండ్రులనే దారుణంగా చంపిన తనయుడు
ఎన్నని ఏమని చెప్పను
నైతికవిలువలు లేని చదువులు
ప్రగతికి అవరోధమే....!!
............................
-నైతిక ప్రవర్తనం:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) -విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి