న్యాయాలు -945
"పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పర " న్యాయము
*****
పర అనగా ఇతరులు,హితవాన్ అనగా హితమును కోరేవారు.అపి అనగా అయినా కూడా.బంధుః అనగా బంధువు, చుట్టము.అహిత అనగా హితము లేదా మేలు కోరని వాడు.పరః అనగా పరాయి వాడు.ఇతర వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి.
మన హితము లేదా మేలు, శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకునే వారు, మనకు కష్టము కలిగిన సమయాల్లో సహాయ సహకారాలు అందించి ఆదుకునే వారైన ఇతరులు, బంధువులు కానప్పటికీ వారే నిజమైన బంధువులు, హితులు.అట్టివారే అసలైన స్నేహితులు,మంచి మనసు ఉన్న వారు.
ఇక బంధువులు అయినప్పటికీ తోటి, సాటి వ్యక్తికి హితమును, మేలును, శ్రేయస్సును కోరని వారు పరాయి వాళ్లే అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
మంచితనం ఇంకా మన సమాజంలో అంతో ఇంతో ఉంది.కాబట్టే కష్టపడే వారి కష్టాలను,బాధలతో ఉన్న వారి బాధలను అర్థం చేసుకుని ఎవరూ అడగకుండానే తమంత తాముగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి తగు సహాయ సహకారాలు అందించే మంచి వారు ఉన్నారు.అలాంటి వారి వల్లనే నాడు,నేడు మానవతా విలువలు కాపాడబడుతున్నాయి.
సేవా చింతన తప్ప అలాంటి వారిలో ఎలాంటి స్వార్థం ఉండదు.నదిలా ప్రవహించి కొందరి జీవితాలనైనా సస్యశ్యామలం చేయాలని అనుకుంటారు.తరువులా ప్రాణవాయువు నిచ్చి,కొందరి ఆకలినైనా తీర్చాలని తపన పడతారు.బాధల్లో ఉన్నవారి మనసు గాయాలకు చిరుగాలి లేపనమై ఉపశమనం కలిగించాలని అనుకుంటారు.
ఇలా హితులు,అహితులకు సంబంధించిన ఈ పూర్తి శ్లోకం సంస్కృతంలో ఉంది.దానిని చూద్దామా!.
"పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరః!/అహితర్దే హజర్య్వాధి హితోరరణ్య మౌషధం!!"
అనగా మన హితమును, శ్రేయస్సును, మేలును ఎల్లప్పుడూ కోరుకునే వారు,మన కష్ట సమయాల్లో సహాయ సహకారాలు అందించి ఆదుకునే వారు ఇతరులూ, బంధువులూ కానప్పటికీ వారే నిజమైన బంధువులు,స్నేహితులు.అలాంటి వారే స్నేహితులు.
ఇక మన మేలు కోరని వారు, మనపట్ల ఈర్ష్య అసూయ, ద్వేషము,అకారణ కోపము కలిగి ఏ మాత్రం అవకాశం ఉన్నా కీడు,హాని తలపెట్టడానికి వెనుకాడని వారు మన బంధువులో,రక్త సంబంధీకులో అయినప్పటికీ వాళ్ళు మాత్రం నిజమైన శ్రేయోభిలాషులు, బంధువులు ఎప్పటికీ కారు.కాలేరు. వాళ్ళు ఎప్పటికీ పరాయి వాళ్లే.అందుకే వారిని అహితులు అంటారు.
అలాంటి వీరిని సుభాషిత కారుడు రోగంతో పోల్చాడు.అలాంటి వారు మన శరీరంలో పుట్టిన జబ్బు లేదా రోగము లాంటి వారని అంటారు.మరి ఆ రోగాన్ని వెంటనే తగ్గించుకోనట్లయితే శరీరమంతా వ్యాపించి రోగ గ్రస్తం చేస్తారు. కాబట్టి అలాంటి వారిని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచాలి.వారి దరిదాపుల్లోకి పోకూడదని, ఉండకూడదని అంటారు.
ఇక హితులు అనగా మేలు చేసేవారు జబ్బును తగ్గించే ఔషధం లాంటి వారు.ఎక్కడో దూరంగా అరణ్యాలలో దొరికే అరుదైన సంజీవని లాంటి ఔషధం వారు.సమయానికి ఔషధంగా పనిచేస్తూ మానసిక, శారీరక రుగ్మతలను పోగొడతారు.
అలా మన హితము లేదా మేలు కోరేవారు ఎవరైనా , వారు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవాలి.అప్పుడే ఈ "పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరః" న్యాయమునకు న్యాయము జరుగుతుంది.
అంతే కాదు మనమూ వారిని స్ఫూర్తిగా తీసుకుని తర తమ అనే భేద భావం చూపకుండా వారి అడుగు జాడల్లో నడవాలి.వసుధైక కుటుంబ భావనతో సామాజిక రుగ్మతలను దూరం చేసే, పోగొట్టే ఔషధం కావాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి