ప్రతి శుక్రవారం లలితా సహస్ర నామ పారాయణం చేయడం అందరికీ తెలిసిందే. అయితే శరన్నవరాత్రులప్పుడు ఈ లలితా సహస్ర నామాన్ని ఇళ్ళల్లోనే కాకుండా ప్రతి హిందూ దేవాలయంలోనూ పఠించడం చూడొచ్చు. ఇంతకీ ఈ లలితాసహస్రనామం ఎలా వచ్చిందో చూద్దాం.
హయగ్రీవుడు తన శిష్యుడైన అగస్త్యమహర్షి అడిగిన ప్రశ్నకు లలితాసహస్రనామ వివరాలను చెప్పాడు. అసలు ఈ సహస్ర నామస్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాన్ని కూడా హయగ్రీవుడు చెప్పాడు.
పరదేవతా స్తోత్రాలు రహస్యమయంగా ఉన్నాయని, అందులో అత్యంత రహస్యమైనది లలితా సహస్ర నామాలు ఒకటని హయగ్రీవుడు తెలిపాడు.
లలితాదేవికి అత్యంత ప్రియమైనవి. ఈ స్తోత్రం సమస్త అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొడుతుంది. అలాగే సమస్త జ్వరాలను నశింపజేసి దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ఇస్తుందని కూడా హయగ్రీవుడు చెప్పాడు.
ఈ లలితా సహస్ర నామాలు పఠించడం వల్ల శ్రీదేవి సంతోషాన్ని వృద్ధి చేస్తుంది. లలితాదేవి ఉపాసనపై ఆసక్తి కలవారందరూ శ్రద్ధాపూర్వకంగా ఈ స్తోత్రాన్ని పఠించడం ఎంతో మంచిది.
పవిత్ర కురుక్షేత్రంలో సూర్యగ్రహణ కాలంలో కోటి పర్యాయాలు సమస్తమైన దానాలు చేసిన ఫలం లభిస్తుంది.
గంగాతీరంలో కోటి అశ్వమేధయాగాలు చేసినంత ఫలం లభిస్తుంది. అలాగే జలరహితమైన ఊసర క్షేత్రంలో కోటి నూతులను త్రవ్వించిన ఫలం కలుగుతుంది. కరవు కాటక సమయంలో కోటి మంది భూసురోత్తములకు సంతర్పణ చేసినంత ఫలం కలుగుతుంది. ఈ రహస్య నామాలలో ఒక్క నామాన్నయినా సరే పఠిస్తే కూడా సత్ఫలితమే లభిస్తుంది. ఒక్క నామాన్ని స్మరించినంతమాత్రాన మహాపాత కోపాతపాలు నశిస్తాయన్నాడు హయగ్రీవుడు.
శ్రీలలితాదేవిని మానసోపచారాలతో పూజించి ఈ స్తోత్రాన్ని పఠిస్తే సాధకుని సకల రోగాలు దూరమైపోయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది.
రాజుని వశం చేసుకోదలచిన వాడు రాజభవనాభిముఖంగా కూర్చుని మూడు రాత్రులు ఈ నామ పారాయణ చేస్తే ఆ రాజు గుఱ్ఱాన్ని గాని, ఏనుగును గానీ ఎక్కి పరవశుడై ఉపాసకుని సమీపానికి వచిచ దాసునిలా వశమవుతాడు. అంటే లలితా సహస్ర నామపారాయణకు ఎంతటి శక్తి ఉందో తెలుసుకోవచ్చు.
ఈ సహస్ర నామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. అలాగే సద్భక్తితో అమ్మవారిని పూజించాలి. అపుపడు శ్రీదేవి సంప్రీతురాలవుతుంది.
లలితా సహస్ర నామాలు పఠించి శ్రీచక్రాన్ని పద్మాలతో గానీ తులసీ దళాలతో గానీ అరుణోత్పలాలతో సంపెంగ పూలతో కానీ జాజిపూలతో కాని మల్లెపూలతోకాని గన్నేరు పూలతో కానీ నల్ల కలువలతో కానీ మారేడు దళాలతో గానీ అమ్మవారిని పూజించాలి.
నవరాత్రి సమయంలోనే కాకుండా ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రోదయ సమయంలో సహస్ర నామాలతో శ్రీ చక్రార్చన చేసేవారు లలితా స్వరూపులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే శుక్రవారంనాడు ఈ లలితా సహస్ర నామాలను పఠిస్తారో శ్రీచక్రంలో లలితాదేవిని సహస్ర నామాలతో పూజిస్తారో వారికి పుణ్యం దక్కుతుంది అంటూ మరిన్ని వివరాలను అగస్త్య మహర్షికి చెప్పి ఈ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు హయగ్రీవుడు. శ్రీదేవి ఉపాసన లేని వారికి, భక్తి హీనులకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించకూడదని కూడా చెప్పాడు హయగ్రీవుడు. హయగ్రీవుడు – అగస్త్య మహర్షి మధ్య జరిగిన సంభాషణను సూతమహర్షి మిగిలిన రుషులకు చెప్పినట్లు పురాణాల మాట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి