వరలక్ష్మీ వ్రతం :- మంజుల పత్తిపాటి
చినుకు పూల జల్లులు స్వాగతం పలుకగా 
నేలమ్మ మట్టి పరిమళాల తో  సుస్వాగతం పలుకగా

సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి
కోరిన వరాలను ప్రసాదించే తల్లి
 
దివి నుండి భువికి దిగివచ్చే 
అష్టైశ్వర్యాలు కరిపించే 

గృహిణులు నూతనవస్త్ర ధారణతో
పసుపు కుంకుమలతో ప్రార్థించగా 

దీర్ఘ సుమంగళిత్వము ప్రసాదించే 
చిరు నవ్వుల సిరుల పంట పండించే

సమస్త లోకాలకు మేలుకొలుపు నీవే అమ్మ 
నీచల్లని చూపే చాలమ్మ 

శ్రావణ మాసమున
రెండవ శుక్రవారమున
వరలక్ష్మీ వ్రతం రోజున
నా పుట్టిన రోజు కావడం ఏ పుణ్య ఫలమో
 
ఆ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలు
మీపై ఎల్లప్పుడూ ఉండాలని
మీకు సకల సౌభాగ్యాలూ
కలగాలని కోరుకొంటూ
అందరికీ వరలక్ష్మీ వ్రత పండుగ శుభాకాంక్షలు
===============================
మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218

కామెంట్‌లు