చీమలవిశేషాలు ! అచ్యుతుని రాజ్యశ్రీ

 చీమలపేర్లు వాటి వృత్తులు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది.ఆర్మీ,డ్రైవర్ బుల్ డాగ్,వీవర్, ఫైర్,సిల్వర్,హార్వెస్ట్ యాంట్స్ అని బోలెడన్ని రకాలు.అసలు ప్రపంచం లో తొలి రైతు చీమ! ఆకుల్ని కసపిసనమిలి ఫంగస్ కి ఎరువుగా వాడి దాన్ని బ్రేవ్ మంటూ భోంచేస్తాయి.ఫుట్బాల్ సైజ్ తోటలో మిలియన్ల చీమలు ఫంగస్ ని పెంచుతాయి. పండిన పంటను గూటిలో దాస్తాయి మనధాన్యపు గిడ్డంగిలాగా! ఇక ఆర్మీ చీమలుదేశద్రిమ్మరులు.తమ ప్రయాణంలో తాత్కాలిక గూడు ఏర్పాటుచేసిన అవి ఎలా ఉంటాయో తెలుసా?తమనోటి దవడలు కాళ్లతో చెట్టు దుంగ కి వేలాడుతూ లోపలున్న రాణీచీమను కాపాడ్తాయి.అవి చుట్టూ పిట్టగోడ ప్రాకారంలాగా కడ్తాయి.ఆహారంకోసం వలసపోతాయి తమ పెద్ద తండాలతో! ఇతరచీమలపై దాడిచేసి బానిసలుగా పట్టుకుంటాయి. రాత్రంతా ప్రయాణం చేస్తూ పగలు ఒకచోట ఈ ఆర్మీ చీమలు ఉంటాయి పగలంతా చాలా చాలా రకాల జీవుల్ని చంపి తింటాయి అవన్నీ కలిసి బల్లులు పాములు కోడి పిల్లలు పందులు మేకలు తేలు ఇంకా అనేక జంతువులను చెట్టు పైకెక్కి పక్షులను పురుగులను తింటాయి ఈ ఆర్మీ చీమలు ఎంత భయంకరమైన ఉగ్రవా వాదులో మనకు తెలుస్తుంది బహుశా ఇవి పెద్ద పెద్ద అడవుల్లో మనిషి సంచారం లేని ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి మనిషికి ఐకమత్యం గూర్చి బోధిస్తాయిచీమలకి రెక్కలు ఉండవు కానీ రాణి చీమ గాలిలో ఎగిరి జతకడుతుంది ఆపై కిందకి వాలి తన రెక్కలను పీకేస్తుంది తన కాళ్ళను రెక్కలపై గట్టిగా మెలితిప్పి అలా రెక్కలను విధించి ఒక చిన్న బురియ చేసి అందులో ఒక్కతే ఉంటుంది తరువాత గుడ్లు పెడుతుంది రాణి చీమ దానికి ఆహారంగా ఎగరటానికి వీలుగా రెక్కల్ని ఉపయోగించుకొని ఆపై దాన్ని వదిలించుకుంటుందిరాణి చీమ కింద శ్రామిక చీమలు సైనిక చీమలు పనిచేస్తాయి డ్రైవర్ చీమలు ఆఫ్రికాలో ఉన్నాయి ఇక హనీ పార్ట్స్ చీమలు చాలా పెద్ద బాన పొట్టలతో తేనె నిండి ఉంటాయి ఇక ఫైర్ చీమ విషపూరితమైనది ఆస్ట్రేలియాలోని బుల్ డాగ్ చీమ చాలా పెద్దదిగా ఉండి అతి ప్రాచీనమైన చీమగా చరిత్ర సృష్టించింది🌹
కామెంట్‌లు