కరీంనగర్ కార్ఖానా గడ్డ హై స్కూల్- ఓ జ్ఞాపకం : - వారాల ఆనంద్

 ఎ దౌలత్ భి లేలో ....  ఎ షౌరత్ భి లేలో ......భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ  
మగర్ ముఝ్ కో లౌటాదే ...బచ్ పన్ కా సాయా
ఓ కాగజ్ కి కష్తి ... ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)
ఈ గజల్ ని  జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. విని ఆనంద పరవశున్ని అయ్యానో, కన్నీటి పర్యంతమయ్యానో చెప్పలేను. నిజంగా బాల్యాన్ని గురించీ, దాని మాధుర్యాన్ని గురించీ గొప్పగా ఆవిష్కరించిన అద్భుత గీతాల్లో ముందువరసలో వుంటుందీ గజల్, ఆ కవికి చేతులెత్తి నమస్కరించాల్సిందే.
అయితే అందరి బాల్యం గొప్పగా ఉంటుందా, ఊహల్లోనే అందంగా ఉంటుందా అంటే చెప్పలేం
       నాన్న నన్ను అయిదవ తరగతి వరకు స్కూలుకు పంపలేదు. తానే అన్నీ అయి సిలబస్ ప్రకారం చదువు చెబుతూ వచ్చాడు. చదువుల్లో కొంత చురుగ్గా వుండడంతో మెప్పులు కూడా అందుకుంటూ వచ్చాను. 
ఇక నన్ను నాన్న 1967 లో ఆరవ తరగతిలో ఖార్ఖానగడ్డ హై స్కూల్ లో చేర్పించారు. 
అక్కడ 6 అండ్ 7 తరగతులు చదివాను. ఆ స్కూలు అనగానే హిందీ చెప్పిన ఠాకూర సింగ్ సారు, కలిసి చదువుకున్న నరేందర్, రాధ తదితరులు గుర్తొస్తారు. అంతేకాదు ఆ స్కూలుకు వెళ్ళే దారిలో తీరందాజ్ టాకీస్, అది దాటితే పెద్ద కుంట వుండేది వర్షాకాలం అది మత్తడి దుముకి రాక పోకలకు అంతరాయం కలిగేది. ఇప్పుడు అక్కడ ఓ పక్క వైశ్య భవన్, మరో పక్క శనివారం అంగడి నడుస్తున్నాయి. ఇంకోటి కార్ఖానా గడ్డ రోడ్డు మీదే ఎం.ఎల్.ఏ గా పని చేసిన ప్రేమలతా దేవిగారి ఇల్లు ఉండేది. ఇక ఆ స్కూలు వదిలేసి గంజ్ స్కూలుకు వచ్చింతరవాత అక్కడి మనుషులు విషయాలు మరుగున పడ్డాయి. కాని రాధ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా తిరిగి పరిచయమయ్యారు. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని చాలా ఆనందపడ్డాం.
కార్ఖానా గడ్డ బడిలో ఏడవ తరగతి అయ్యాక COMPOSITE MATHEMATICS గంజ్ హై స్కూలుకు మారి 8 వ తరగితిలో చేరాను. 
దాంతో కొత్త అధ్యాయం మొదలయింది. 
++++  ఇప్పుడు అయిదు దశాబ్దాల కాలం గడిచాక సెప్టెంబర్ ఒకటిన ఆ స్కూల్లో నా 25 వ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం గొప్ప ఉద్వేగంగానూ ఉత్సాహంగానూ వుంది. 
స్మృతి మధురమయిన సందర్భాన్ని మిత్రులతో పంచుకుంటున్నాను.. VERY EXCITED 
===
కామెంట్‌లు