నదుల్ని బంధించి సముద్రం
చరిత్రను సృష్టించింది.
మేఘం యుద్ధం చేసి గెలిచి
ఎగిరింది.
మధుల్ని సమాధి చేసిన మెదళ్ళు
కళ్ళు పోగొట్టుకున్నయి.
కలలో కదిలి కదిలి కలిసిమెలిసి
సాగుతున్నవీ.
ఉదయ సంధ్యలు రాబందుల రెక్కల
చప్పుళ్ళలో మేల్కొంటూ
మాంసపు ముద్దల్లా మారుతున్నవీ
పారుతున్న రక్తం ఎగురుతున్న పక్షిది
కరుగుతున్న గుండె ఒరుగుతున్న కొండది.
స్వేచ్ఛ గాలిగా మారింది. పక్షి రూపంలో.
పచ్చి మాంసపు వాసన ప్రసవానిది
ఎక్కడో పసివాని ఏడుపు వినిపిస్తుంది.
ఆగకుండా పరుగిడే పరుగు పందెంలో
గోడ గడియారం గుండె గా మారింది.
గెలుపు కాదు
ఎప్పుడూ ఆగేది ఆతృతగా ఉంది.!!?
నిశ్శబ్దంగా భూగోళం లో చప్పట్లు వినిపిస్తున్నవీ
ఆకాశం ఆ శబ్దాన్ని మోయలేక ఆగిపోయింది.
గడ్డ కట్టిన రాళ్లకు గుడ్డలు చుట్టి గంధపు బొట్లు పెట్టి
గుళ్ళల్లో బంధిస్తున్నారు
వాళ్లు మాతృమూర్తులు.
గర్భగుడిలో వెలుగుతున్న అఖండ దీపాలు వాళ్ళు.
నమ్మకం విశ్వాసపు విశ్వవిజేతలు వాళ్లు.
వాళ్లను కలిపేది ఆకర్షణ కాదు ప్రేమ!!
వాళ్లను విడగొట్టేది జ్ఞానం కాదు అజ్ఞానం.!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి