శ్రావణం శుభకరం :-అచ్యుతుని రాజ్యశ్రీ
ఆషాఢం గ్రామ దేవతల బోనాలు 
శ్రావణమంతా "ఆర్ద్రాం పుష్కరిణీం" అన్న మంత్రాలు
"అహం బ్రహ్మ స్వరూపిణీ పురుషాత్మకం జగత్ మత్త:"

ప్రకృతిమాత  చిరుజల్లుల నవ్వులతో చేమంతుల సింగారం
కమలాల కన్నులతో హేలగా వీక్షించు

సోమవారం శివారాధన 
మంగళగౌరీ వ్రతాలు, ఇంటింట 
పసుపు కుంకుమ మావిడాకుతోరణాలు 
ఆరోగ్య దాయకం
పెళ్లి బాజాలు మృష్టాన్న భోజనాలకే కాదు 
ఋతువులని బట్టి  పండగలు సంప్రదాయాలు 

వర్షాలు బురదకి కాళ్లు చేతులు పాసిపోయి 
ఇన్ఫెక్షన్ రాకుండ పాదాలకు పసుపు
,గోరింట చేయంత కుంకుమ పూవంట
ఇంట్లోపట్టిన కాటుక తో కంటివ్యాధులు దూరం,కళ్లజోడులేని కాలం

జడలోని చేమంతులతో జుట్టు లో 
 పేలు పరుగులు,కుంకుడురసంతో 
కురులు నిగారింపు
మొలకెత్తిన సెనగలు,అరటిపండు తాంబూలంతో వాయనం
శరీరానికి కావాల్సిన ఖనిజాలు విటమిన్లు

సోషలిజం సమానత్వం భావాలతో  
పేరంటంపేరుతో పంచుకునే సోదరీతత్వం
పూజ వ్రతాలపేరుతో ఆనాటి సమాజం 
మగువలంతా మనసువిప్పి బాతాఖానీతో పేరంటాలు

నేడు అంతా ఉల్టాపుల్టా
ఆలయంకి మొక్కుబడిగా పోయి
పండుగ విశిష్టత అంతరార్థం గ్రహించని విదేశీవ్యామోహం 
తరతరాల భారతీయ సంస్కృతి
మాయం కాకుండ బడిలో ఆచరించటం
 పిల్లలకు అవగాహన కల్పించడం  మన విధి
అదే తరగని పెన్నిధి 

 ....స్వస్తి..


కామెంట్‌లు