వింత మనసులు...!!: - డా.కె. ఎల్. వి.ప్రసాద్

 కొంతమందికి
కొన్ని అవసరాలు
ఆకర్షణీయమైన
స్నేహాలుగా
మార్చబడతాయ్!
అవసరాలు ఉన్నంతవరకూ
ఆ స్నేహాలు
కడు పసందుగా
వెన్నెల వెలుగులవుతాయ్!
ఇలాంటి స్నేహమే
ఇంకొకరికి అతివేగంగా
అవసరాన్ని బట్టి
బదిలీ అవుతుంది!
క్రమంగా
మొదటి స్నేహం
బలహీనమై
ఒకానొక దినాన
కనుమరుగైపోతుంది!
ఇలాంటి స్నేహాలు
మనిషి మనసును
చిద్రం చేస్తూంటాయ్!
స్నేహాన్ని కోరుకునే
ఆడ_మగ ఎవరైనాసరే 
జర భద్రం సుమా...!!
          ***

కామెంట్‌లు