దయగల వర్తకుడు:---డా.పోతగాని సత్యనారాయణ
 ధర్మపురి పట్టణంలో లక్ష్మీపతి అనే పిసినారి వర్తకుడు, ధర్మయ్య అనే దయాగుణం గల వర్తకుడు ఉండేవారు. లక్ష్మీపతి ధనవంతుడైనా ఇతరుల సుఖాన్ని చూసి ఓర్వలేడు. ధర్మయ్య తన లాభాలను పేదల విద్య, అన్నదానం కోసం వెచ్చించేవాడు.
ఒకసారి తీవ్ర కరువు రావడంతో ధర్మయ్య పెద్ద అన్నదానం ఏర్పాటు చేశాడు. ధర్మయ్య మంచి మనసుకు ప్రజలు అతన్ని కొనియాడారు. ఇది చూసి లక్ష్మీపతికి అసూయ కలిగింది. ధర్మయ్య అన్నదానాన్ని ఆపాలని అక్కడికి వెళ్ళి, పేదలను బద్ధకస్తులంటూ, ధర్మయ్యను నిందించాడు. 
“మీరంతా నిజంగా ఆకలితో ఉన్నారా? లేక ధర్మయ్య దానగుణాన్ని ఆసరాగా చేసుకుని ఇలా అడుక్కు తింటున్నారా?” 
అని అన్నం తీసుకుంటున్న వారిని అవమానించాడు. లక్ష్మీపతి మాటలకు బాధపడి పేదలు అన్నం తీసుకోకుండా వెళ్లిపోయారు. ధర్మయ్యకు దుఃఖం కలిగింది. లక్ష్మీపతి మాత్రం సంతోషించాడు. 
ఈ సంఘటన తర్వాత లక్ష్మీపతిని పట్టణ ప్రజలు దూరం పెట్టారు. వ్యాపారంలో నష్టాలు వచ్చి, ఒంటరిగా మిగిలిపోయాడు. ధర్మయ్య మాత్రం తన దానగుణంతో ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు, సంతోషంగా ఉన్నాడు.

కామెంట్‌లు