మా అమ్మమ్మ చాగంటి శేషమ్మ. 'ఆవిడకడుపు చల్లగా ' తామర తంపర లాంటి ఆవిడ వారసులలో నేనొకదాన్ని.మా అమ్మమ్మ నిష్టాగరిష్టురాలు. నిప్పులు కాదుగానీ బొగ్గులు కడిగి వంటచేసేంత ఆచారవంతురాలు. ఉదయంపూటంతా చిన్న అంగవస్త్రం ఇప్పటి హీరోయిన్స్ చిన్న గుడ్డపీలికను మెడవెనుక ముడేస్తారే అలాంటిది కట్టుకొని,పిల్లల బువ్వాలాటలోలక్క పిడతల వంటి చిన్న చిన్న గినన్నెలతో వండుకొని చనిపోయేనాటివరకూ తింది. మధ్యాహ్నం భోజనమైపోయేకా, తెల్లటి మెతచతటి గ్లాస్కో పంచకట్టుకొని, ఊళ్ళోనేవున్న కూతుళ్ళింటికో మనవలింటికో, మనవరాళ్ళింటికో, లేక చుట్టాలింటికో సాయంకాలం పొద్దువాలేవరకూ చక్కెర్లు కొట్టివచ్చి పొద్దుటమూతపెట్టుకొన్నదే కాస్తకతికి, ఆ ఆరడుగులపొడవుతో బక్కగా వుండే మనిషీ కాళ్ళుజాపుకొంటే చాలని మూడడుగుల మంచంపై ముడుచుకొని పడుకొనేది.
నాయనమ్మను ఆట పట్టించడానికి మనవలు ఆవిడ పడుకొన్నాకా ఆవిడ తెల్లటి పక్కపై ఎంగిలివేవో పడేసేవారు.అలోమని ఏడుస్తూ, పక్కబట్టలూ, మంచం తడిపి ఆరేసుకొనేది.ఆవిడ ప్రతిదినం భోజనం చేసే వెండికంచం దాచేసి ఆవిడను అలోమని ఏడిపించేవారు. అలాచేయడం తప్పని మందలించని పెద్దలు పెద్దశిక్షలే అనుభవించారు చివరి దశలో. 'నవ్వుతూ చేసిన పనికి ఏడుస్తూ అనభవించడమంటేదే.'
**
తన తల్లికడుపున ఒకత్తిగా పుట్టి పెరిగిన మా అమ్మమ్మ శేషమ్మ, తెలుగునాడులో అందరి ఆడవాళ్ళలాగే,తనకు సంతానం కలగాలనీ,మాలాలమ్మాశి,' భాద్రపదమాసంచివరిరోజున వస్తుంది. అసలు ఆ అమావాశ్య పేరు
'మహాలయ అమ్మవాశ్యట'.
'ఆశ్వయుజ మాసం చవరిరోన వచ్చే అమవాశ్య పోలాలమ్మ అమావాశ్య'.అయతే సాధారణంగా మాలాలమ్మవాశ్య, పోలాలమ్మవాశ్య అంటాము సులువుగా పలకవచ్చని.
పైన వచ్చే రెండమ్మవాశ్యలకు తలుగు గృహిణులు సతంతువులైనా, వితంతువులైనా, పక్కన పిలకమొక్క వున్న కందమొక్కకు మన ఆంధ్రావాళ్ళం పూజలుచేస్తాం.పిల్లలు లేనివాళ్ళకు పిల్లలుకలుగుతారని, కలిగిన పిల్లలు ఆరోగ్యంగా కలకాలం జీవించాలని, మగపిల్లకి బూరెలు దండగుచ్చి, కందమొక్క మెడలోవేసి, బూరెలు నైవేద్యంపెడతారు. అదే ఆడపిల్లలక్షేమానికైతే గారెలదండ కందమొక్క మెడలోవేసి, గారెలు నైవేద్యం పెడతారు. రెండమ్మవాశ్యల పూజలకూ ఈ పూజలలో చదవ వలసినకథ కూడా చెపుతారు. ఆరోజున తరిగిన కూరలు అమ్మలు, అమ్మమ్మలూ తినరు.అలా తరిగినకూరలు తింటే 'కడుపుశోకం' అంటారు. తమషా ఏమిటంటే అమ్మమ్మలూ తన సంతానం క్షేమంకోసం ఈ పూజలు చేస్తారు. ఆమె కూతుళ్ళుకూడ వారి సంతానం కోసం, వారిక్షేమం కోసం ఈపూజలు చేస్తారు. మొత్తానికి అమ్మమ్మలూ, అమ్మలూకూడా వారు బ్రతికి వున్నంతకాలం ఈ అమావాశ్యల పూజలు చేస్తారు.అవును మరి
'కాకిపిల్లలు కాకికి ముద్దు'అన్నట్లు, అమ్మమ్మ పిల్లకోసం అమ్మమ్మ, అమ్మ పిల్లలకోసం అమ్మ ఈ అమవాశ్య పూజలు చేస్తుంటారు.అయితే కొందరు ఒక అమావాశ్యపూజే చేస్తే, మరికొందరు రెండమ్మవాశ్యలూ చేస్తారు. ఇంతకూ కందకు పూజలెందుకంటే, కందమొక్క తనచుట్టూ అనేకమైన పిలకమొక్కలను పెడుంది. అలా తన సంతానం వృధ్ధిచెందాలని కందగౌరమ్మను పూజిస్తారు.అలా ఎంత నిష్టగా కందగౌరి అమవాశ్య పూజలు చేసి చేసి ఇంత పెద్ద కుటుంబాన్ని పోగుచేసింది కానీ, ఆ సంతులోని పిల్లల పిల్లలే ఆవిడకి కల బ్రహ్మ చెముడు లోపం వలన ఆవిడను అనేకరకలుగా అవమానించి బాధపెట్టేవారు.
ఇంతకీ ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మా అమ్మమ్మ అమ్మ, అంటే మాతాతమ్మ లక్ష్మీ నరసమ్మగారికి, మా అమ్మమ్మ కడుపున పడగానే మా తాతమ్మ భర్త పోయాడుట. మాతామ్మని కొందరు బంధువులు"భర్తలేకుండా ఆ పసిగుడ్డును ఎలా పెంచుతావు?కడుపులో పిండం పెరగకుండానే,మందోమాకో మింగి ఆ జంఝాటం వదిలించుకో!" అన్నారట.అయితే ఆవిడామాటలు వినకుండా, మా అమ్మమ్మైన
శేషమ్మగారిని కనిపెంచిందట. అప్పుడుకూడా"ఆడ పిల్లను మగతోడులేకుండా ఎలా పెంచగలవు? వడ్లగింజవేసి వదిలించుకో!" అన్నారట అదేబంధువులు.
అయినా మాతాతమ్మ ఆమాటలేవీ చెవిన పెట్టక, ఆపిల్లకు శేషమ్మ అని పేరుపెట్టి, పెంచి పెద్దచేసి, 'నల్లూరు' నివాసులైన,మా అమ్మ తండ్రిగారైన 'చాగంటి అనంతరామయ్య'గారికిచ్చి పెళ్ళిచేసింది. ఆ నంతరామయ్యగారి తమ్ముడే, 'ఆంధ్ర కవితరంగిణి'అని ఆయనకాలం వరకూ కథలు, కావ్యాలు వ్రాసిన కవుల పేర్లను, వారువ్రాసిన గ్రంథాలను పరిచయం చేస్తూ,చాగంటి శేషయ్యగకవిగా పిలువబడిన మా చినతాతగారు శేషయ్యగారు కపిలేశ్వరపురం జామీంనుదారుల దివాణంలో,దివాన్గా పనిచేసేవారట. మాచినతాతగారైన శేషయ్యగారు 'దుర్గేశ్ నందిని'అనే మొదటి 'అపరాధ పరిశోధన'సీరియల్ నవలలు వ్రాసిన రచయితగా సుప్రసిధ్ధులు. (నెట్ లో దొరుకుతాయి ఆయన రచనలు)
ఇంతకీ మనం చెప్పుకోవలసినది చాగంటి శేషయ్యగారి గురించి కాదు, ఆయన వదినగారూ, మా అమ్మమ్మాఅయిన చాగంటి శేషమ్మగారిగురించి కదా!
మా అమ్మమ్మ అమావాశ్య కందపూజలు ఎంత భక్తిగా చేసిందో ఏమోకానీ, ఆవిడకు నలుగురాడపిల్లలూ, ఇద్దరు మగపిల్లలు. వారిలో ఆవిడతల్లి పేరుపెట్టుకొన్న నరసమ్మగారికి తప్ప తతిమ్మా అందరికీ సంతానంవుంది.ఆవిడ తామర తంపరవంటి వారసులలో,పోయినవారు పోగా, వున్నవారికి లెక్కకు మిక్కిలిగా సంతానం కలిగింది. ఇలా మేంతా శేషమ్మగారి మనుమలమైతే, మళ్ళీ మాకు సంతానం, మా సంతానానికి కలిగిన సంతానం. ఇలా మా అమ్మమ్మ వారసులం యిప్పటికి ఎనిమిది, పదితరాలువరకూ వృధ్ధిచెంది, మూడొంలు నాలుగొందలకు పైనే తయారయ్యాము. మధ్యలో గవర్నమెంటు ఫామిలీ ప్లానింగన్నది పెట్టి చచ్చిందికానీ, లేకపోతే ఈపాటికి కనీసం 'సహస్రం' మంది వారసులం అయ్యుండేవారమనుకుంటానేను.కనీసం 'లిమ్కా బుక్ ' లోకేనా ఎక్కివుండేది మా అమ్మమ్మ పేరు.
ఆనాడు కోట రామచంద్రపురంలో ఒక ఏభై అరవై కుటుంబాలు పైగానే మావాళ్ళకుటుంబాలువుండేవి.
ఏమాత్రం కాళీ దొరికినా, మా అమ్మమ్మ
ఏదోసమయంలో, కొంతమంది బంధువులనైనా పలుకరించివచ్చేది. ఉదయాన్నే కూతుళ్ళింటికో, మనవల ఇంటికో వెళ్ళి, తనకు తోచిన సహాయంగా, కూరలు తరగడంలాంటివి చేసివచ్చేది. అలాగే తన చెవిన పడనే పడవు కానీ, పడిన విషయాలనుమాత్రం ఆ ఆ ఇళ్ళలో పంచిపెట్టివచ్చేది.
అయితే ఏ కానుపులో వచ్చిందోకానీ మా అమ్మమ్మకు 'బ్రహ్మచెముడు'వచ్చి పడింది. ఆమె "వాళ్ళేదో మాట్లాడుకొంటున్నారులే, నాకు వినపడదుగదా నకెందుకు?" అని వూరుకొనేదికాదు.
"ఏమిటర్రా! చెప్పుకొంటున్నారు?" అని ఆరాతీసేది. ఆవిడకు వినిపించాలని అరచి చెప్పి చెప్పి ఆవిడ కూతుళ్ళకీ, మనవలతోపాటు చుట్టాలకీ, పట్టాలకీ పెద్దగొంతుతో మాట్లాడడం అలవాటైపోయింది. వవరందరూ ఎంతగా అరచి చెప్పినా,ఆవిడకు మాత్రం ఒక్కమాటకూడా వినపడేదికాదు.అరచి చెప్పలేక, "అన్నీ నీకేకావాలి. నీకు వినపడకపోవటంకాదుకానీ, నీకు చెప్పలేక,మాకు ఆయిలో ప్రాణం కోయలోకొస్తోంది"అనికన్నపిల్లలే విసుక్కొనేవారు.పాపం అమ్మమ్మకు వాళ్ళమాటలు వినపడకపోయినా, తనను విసుక్కుంటున్నారని,వినిపించేలా చెప్పలేక తిట్టుకుంటున్నారనీ,అర్థమై ఆమె మొఖంచిన్నపోయేది.అన్నట్లు ఇక్కడే వొక్కమాటకూడా మీకు చెప్పెయ్యాలి. ఈకోటరామచంద్రపురానికి చెందిన వారికి రకరకరకలైన భయంకరమైన తిట్లు వస్తాయి."నీ శార్దం, నీ పిండాకూడు, నీ వల్లకాడు" లాంటి తిట్లు. ఆతిటలకి అర్థాలు తెలిసి తిట్టడంకాదు, ముద్దుగా కూడా అలాంటి భయంకరమైన తిట్లు తిట్టుకొంటారు వారు.
అలా మముసలామెను ఏడిపించడం తప్పని తెలియని వయసులో, మేముకూడా అలా మా అమ్మమ్మను బధపెట్టేవారం.తెలిసినవారున్నా, తప్పని చెప్పేవారులేక ఆవిడను బాగాఏడిపించేవాళ్ళం. ఆమెను ఏడిపించడానికని,ఏదో మాట్లాడుతున్నట్లు పెదవులు కదిపితే,"ఏంటర్రా! అంటున్నారు"అని అడిగితే, నాలుక చూపించి వెక్కిరించి, ఏమీలేదని చేతులూపి పారిపోయేవాళ్ళం. ఆవిడ కోపంతో తిట్టిపోసేది మమ్మల్ని. ఆవిడకు మా మాటలు వినపడవుకానీ, ఆవిడ తిట్టేన తిట్లు మాకు బాగనే వినపడినా మేము పెద్దగా లెక్కలోకి తీసుకొనేవారమేకాదు.
పెద్ద పెద్ద కుటుంబాలన్నాకా, కుటుంబాలలో మంచి చెడ్డలు ఏవో జరుగుతుంటాయి. గొడవలూ, గందరగోళాలూ కూడా తెలుగుల ఇళ్ళలో మామూలేకదా!
అలాంటి సమయంలో అందరూ గుమిగూడి మాట్లాడుకొంటుంటే,కుతూహలంతో అమ్మమ్మ "ఏమిటర్రా! గొడవపడుతున్నారు? ఏం జరిగిందీ?"
అంటూ ఆత్రంగా అడిగేదావిడ. ఎవరో ఒక సాహసికులు చెప్పడానికి ప్రయత్నం చేసినంత చేసి, సాధ్యపడక వూరుకొంటే, మా పెద్ద దొడ్డమ్మ పెద్ద కూతురికొడుకూ, అమ్మమ్మ తొలి ముని మనవడైన 'అద్దంకి సుబ్బారావు' "ఈ గొడవలూ గందరగోళాలూ అన్నీ నీవల్లేనే ముసలిదానా! మీ అమ్మ ఆ నరసమ్మగారెవరోగానీ, నువ్వు పుట్టగానే నీ నోట్లో ఒక వడ్లగింజ వేసుంటే, మాకు ఇప్పుడీ సమస్యే వచ్చుండేదేకాదు." అనేవాడు.అప్పుడు వాడు చెపింది వినపడిందో లేదో కానీ, ఆవిడకు ఊతపదమైన" అయ్యో!శబాసూ." అనేది గెడ్డంకింద చెయ్యిపెట్టుకొని. అమాట కూడా ఆవిడను వెక్కిరించడానికి మరోటైయ్యింది మా పిల్లమూకకు.
ఆవిడ లోపాన్ని లోకువగా తీసికొని, ఆవిడ మనసుని గాయపరచిన ఆవిడ వారసులు అనేకమంది అనేక విధాలుగా బాధ పడ్డారు, ఈనాటికీ కొందరు బాధలు పడుతున్నారుకూడా.
మునిమనవడైన అద్దంకిసుబ్బారావు అన్నమాట నిజమేకానీ,అలాగనక జరిగుంటే,మా అమ్మమ్మ చెవిటి వారసత్వం ఏమైపోయుండేది?ఎటుపోయుండేది? ఆనాడు ఆవిడ చెముడుకి విసుక్కొన్న, ఆవిడను ఆటపట్టించిన, ఆవిడ వారసులమైన చాలామందికి, చెవిలోకి చెవిటి మిషన్లుదూరాయి ఈనాడు.ఇంకా నా చెవి వరకూ మిషన్ రాలేదు కానీ, ఏమో ఎప్పుడు వస్తుందో ఏమోనని నాకూ భయం భయంగానే వుంది.అందుకే ఈమధ్య చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని, మంచి మంచి పాటలు వినడం కూడా మానేసాను నేను, ఏమో!ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్తగా తెలివైనదాన్నికనుక.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి