నా శ్వాస కవనం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా శ్వాస కవనం
నా ధ్యాస కవిత్వం
నా జోడు కవిత
నా తోడు సాహితి

నా ప్రాణం సాహిత్యం
నా జీవితం వాగ్దేవికంకితం
నా మాటలు కడుమధురము
నా బాటలు అతిరమణీయము

నా ఇష్టం కలంపట్టటం
నా యత్నం పుటలునింపటం
నా ఆశయం వ్రాయటం
నా ప్రయత్నం పాడటం

నా అక్షరాలు ముత్యాలు
నా పదములు పుష్పాలు
నా భాష తేటతెలుగు
నా కూర్పు అచ్చతెలుగు

నా రాతలు ఆకర్షణీయము
నా చేష్టలు ఆచరణీయం 
నా ఊహాలు మదిపొంగులు
నా భావాలు మనోకల్పితాలు


కామెంట్‌లు