జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో "టీచ్ ఫర్ చేంజ్’ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మీ: - వెంకట్ , మొలక ప్రతినిధి

 నటీమణి-సామాజిక సేవకురాలు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి టీచ్ ఫర్ చేంజ్ ,రత్నా రెడ్డి నేతృత్వంలోని వేని రావు ఫౌండేషన్ తో కలిసి,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినిలకు శానిటేషన్ పాడ్స్ , స్మార్ట్ క్లాస్ రూమ్ లను ప్రారంభించారు.ఈ విస్తరణలతో,టీచ్ ఫర్ చేంజ్, వేని రావు ఫౌండేషన్ కలసి రాష్ట్రవ్యాప్తంగా 9,000 మందికి పైగా విద్యార్థులు మరియు బాలికల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేశాయి.
ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ....మా స్పీచ్ ఫర్ చేంజ్ అనే ఫౌండేషన్ను ప్రారంభించి 11 సంవత్సరాలు అవుతుంది. 
మా  ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ను సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ప్రారంభించాము. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తీర్చిదిద్దే విధంగా స్మార్ట్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసి విద్యను అందించాలని ఉద్దేశంతో మా స్పీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ పని చేస్తుంది. 
స్మార్ట్ క్లాస్ రూమ్ లు వలన టీచర్లు ఎక్కడి నుండైనా విద్యను అందించే విధంగా యాక్సెస్ చేసే విధంగా మునుముందు ఏర్పాటు చేస్తామని తెలుపుతున్నాం. “ప్రతీ చిన్నారి, వారి నేపథ్యం ఏదైనా, నాణ్యమైన విద్య పొందాలి, ప్రతీ బాలిక భయం లేకుండా, మొగమాటం లేకుండా పాఠశాలకు వెళ్లగలగాలి అన్నదే  మా లక్ష్యం.వేని రావు ఫౌండేషన్‌తో మా భాగస్వామ్యం ద్వారా, మేము నిజమైన, కొలవగల మార్పును సృష్టిస్తున్నాం.నేవీ రావు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రత్నారెడ్డి మాట్లాడుతూ...“విద్య, ఆరోగ్యం సమానత్వానికి మూలస్థంభాలు.స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ,  ఫ్లో ఫార్వర్డ్ కార్యక్రమం, పిల్లల ,  సమాజాల జీవితాలకు శాశ్వత ప్రభావాన్ని సృష్టించాలన్న మా సంకల్పానికి నిదర్శనం.అన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు...
కామెంట్‌లు