“ఎనిమిది సార్లు నాకు అమెరికా వీసా నిరాకరించారు…చివరికి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే యాప్‌లలో ఒక దానిని సృష్టించాను.” అంటారు ఎరిక్ యువాన్.
ఈయన చైనాలోని ఒక చిన్న మైనింగ్ పట్టణంలో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచీ ఓ సాంకేతికతమీదే కలలు కంటుండేవారు. అది కేవలం ఆవిష్కరణ కోసం కాదు, ప్రజలను దగ్గర చేయడానికై ఉండాలనుకున్నారు.
సుదూర ప్రేమ నన్ను ఆలోచనలో పడేసిందన్న యువాన్ మాటల్లోనే....
"నేను నా స్నేహితురాలిని (ఇప్పుడు నా భార్య) సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే చూశాను. ఎడబాటు వల్ల కలిగే బాధ నా హృదయంలో ఒక విత్తనాన్ని నాటింది. ఏదో ఒక రోజు, దూరాన ఉన్నా హృదయాలు దగ్గరగా ఉండేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నేను సిలికాన్ వ్యాలీ గురించి కలలు కన్నాను. కానీ అమెరికా నా వీసాను ఎనిమిది సార్లు తిరస్కరించింది. చాలా మంది ఆ తర్వాత ఎందుకొచ్చిన వీసా అని అక్కడితో వదులుకునేవారు. కానీ నేనలా చేయలేదు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం, కోడింగ్ చేయడం, ముందుకు సాగడం కొనసాగించాను. తొమ్మిదవ ప్రయత్నంలో, నేను దానిని సాధించాను. నేను వెబ్ ఎక్స్‌లో, తరువాత సిస్కోలో ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాను. కానీ వర్చువల్ సమావేశాలు నెమ్మదిగా, గజిబిజిగా ఉండేవి. వాటిని మెరుగుపరచడానికి నేను కొన్ని మార్గాలను ప్రతిపాదించాను. మొదట్లో ఎవరూ వినలేదు. కాబట్టి, నేను వాటి నుంచి నిష్క్రమించాను. అయితే నా పిచ్చి కలను నమ్మిన 40 మంది ఇంజనీర్లతో నేను మొదటి నుండి ప్రారంభించాను.
అయితే ఈ క్రమంలో "జూమ్" ఎలా పుట్టిందో చెప్తాను.
మార్కెట్ చాలా రద్దీగా ఉందని పెట్టుబడిదారులు నాతో చెప్పారు. ఎవరూ లోపలికి రావడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ, మేము పట్టుదలతో ఉన్నాము. పరీక్షించడం, సరిదిద్దడం, వినియోగదారుల మాట వినడం, మెరుగుపరచడం....వీటిని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేశాను.
అది 2020. యావత్ ప్రపంచం దెబ్బతింది. ఎక్కడ చూసినా వినిపించే మాట లాక్ డౌన్. అకస్మాత్తుగా, జూమ్ తరగతి గదులు, కుటుంబాలు, స్నేహితులు, కంపెనీల మధ్య వారధిగా మారింది.
ప్రతి "సమావేశంలో చేరండి" బటన్ వెనుక ఒక దశాబ్దం పాటు మూసిన తలుపులు, కష్టపడి పని చేయడం, అవిశ్రాంత నమ్మకం ఉన్నాయి.
"వద్దు" అంటే మీరు తగినంత మంచి వారు కాదని కాదు. కొన్నిసార్లు, కల, ప్రపంచ వాస్తవికత మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే... వదులుకోవడానికి నిరాకరించే వ్యక్తి...మొత్తానికి జూమ్ ...అలా వినియోగంలోకి వచ్చిందండోయ్"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి