ఏ చిత్రకారుని చేతి కుంచె
నింపిన రంగులివి?
ఏ భావుకుని మదిలో మెదిలిన
అద్భుత కవనమిది!?
నిరీక్షించు నీటికి నింగి
అద్దిన నిర్మల చుంబనమా?
అపేక్ష నిండిన ఏటి
మదిని పండిన ప్రేమా?
పరిసరాల పరాచకాలకు
మురిసి నిండుగ నవ్వే
ఒడ్డున పెరిగిన పచ్చిక
మురిపెపు చూపుల ప్రేమా?
కనక కాంతులు ఒలికించిన
పసిడి కలశపు మెరుపులు
తాకిన పుడమి పొందిన
పులకల మొలకల పరవశమా?
నీలి నింగిని పయనించే
వెలుగుల ఓడ పిలుపులు
వినపడి పాలమబ్బులు పెట్టే
పరుగుల సందడి సవ్వడులా?
కన్నులవిందుగ కవులు వ్రాసిన
కావ్యనాయిక సొగసుల
ఊహకు అందని వయ్యారాలతో
ప్రకృతికన్య ప్రత్యక్ష పరిచయమా?
ఎంత చక్కనిదీ జగతి
ఆ దైవమొసగిన బహుమతి
ప్రత్యూష సమయాన
ప్రసరించు కరుణల స్రవంతికి
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి