ఏకంగా మూడు శతాబ్దాలను చూసిన మహిళగా ఎమ్మా మొరానో చరిత్రపుటలకెక్కింది.
1899 నవంబర్ 29న ఇటలీలోని సివియాస్కోలో జన్మించిన ఎమ్మా 117 సంవత్సరాలు జీవించింది. మూడు శతాబ్దాలను, రెండు ప్రపంచ యుద్ధాలను, ఇంటర్నెట్ ఆవిష్కరణ, అంతరిక్ష ప్రయాణ ఆవిర్భావాన్ని చూసిన మహిళగా ఆమెకో ప్రత్యేకత ఉంది.
ఎమ్మా తన దీర్ఘాయువుకు రెండు ముఖ్యమైన విషయాలను తెలిపింది. అవి : ప్రత్యేకమైన ఆహారం. ఉల్లాసంగా బతకటం.
ఒక వైద్యుడు ఆమెకు రక్తహీనత ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత, దశాబ్దాలుగా ఆమె ప్రతి రోజూ మూడు పచ్చి గుడ్లు తినేది. దీంతో మొరానో తన దీర్ఘాయుష్షు గణనీయంగా పెరిగిందని అంటారు.
విడాకులు చట్టబద్ధం కావడానికి చాలా కాలం ముందరే ఆమె 1938లో వైవాహిక బంధం నుంచి విడివడి స్వతంత్రంగా జీవించడం పట్ల మొగ్గు చూపింది.
ఓరోజు ఆమె ఇలా చెప్పింది...
"నేను ఇకపై ఎవరి నియంత్రణలోనూ ఉండకూడదనుకున్నాను. బహుశా అందుకే నేను ఇంతకాలం జీవించాను." అని.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆమె తన చివరి సంవత్సరాల్లో మానసికంగా బాగా చురుకుగా కనిపించేది. వార్తాపత్రికలు చదివేది. తనను చూడటానికి వచ్చే వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమయాన్ని గడిపేది. ఆనందించేది.
ఎమ్మా కథ సుదీర్ఘమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడంలో స్వాతంత్ర్యం, నిలకడ, ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యపాత్ర పోషించాయి. వయస్సు పైబడుతున్న కొద్దీ ఆమె మనసుని చిన్నపిల్లల్లాంటి మనస్తత్వాన్ని చెదరకుండా ఉంచుకుంది. మొరానో తల్లి 91 సంవత్సరాలు జీవించింది. సోదరీమణులుకూడా దీర్ఘకాలమే జీవించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి