మచిలీపట్నంలో స్థానిక మహతి లలిత కళా వేదికలో శనివారం శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి రచించిన పిల్లలకో బహుమతి కథల సంపుటి ఆవిష్కరించారు .
సభాధ్యక్షులు శ్రీ భవిష్య మాట్లాడుతూ" బాల సాహిత్యం రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గి పోతున్న ఈరోజుల్లో ఇలా పిల్లల కథలు పుస్తక రూపంలో రావడం ఎంతో అవసరం " అన్నారు.
ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కర్త శ్రీ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ "ఇప్పుడు పిల్లలు నీతి కథల పుస్తకాలు చదవడం అనేది మానేశారు పుస్తకాలు చదివే స్థానంలో యూట్యూబ్ లో రీల్స్ చూడ్డానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు తప్పితే ఇటువంటి బాల సాహిత్యాన్ని ముఖ్యంగా పిల్లలకు అవసరమైన నీతి కథలను చదవడానికి ఎవరు ఇష్టపడటం లేదు కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు నీతి కథలు చదివేలా వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు పుస్తక సమీక్షులు శ్రీ టి.పెద్దిరాజు మాట్లాడుతూ 31 కథలతో కూడిన ఈ పుస్తకం పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునేలా ఉండడంతో పాటు ఇది నిజంగా పిల్లలకో విలువైన బహుమతి అని అన్నారు ఏ కథకు ఆ కథే మంచి విలువలతో కూడిన సందేశాన్ని అందించిందని తెలియజేశారు.
గౌరవ అతిథి శ్రీ అప్పినేడు పోతురాజు మాట్లాడుతూ"ఇటువంటి నీతి కథలు పిల్లల్లో వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దుతాయని "అన్నారు.
రచయిత శ్రీ ఏడుకొండలు కళ్ళేపల్లి మాట్లాడుతూ" బాల సాహిత్యంలో ఇప్పటివరకు 103 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయనీ, బాల సాహిత్యం లో 100 కథల మైలురాయి దాటినందుకు ఆనందంగా ఉందని, 31 కథలతో మొదటి కథల సంపుటి పిల్లలకో బహుమతిని విడుదల చేయటం జరిగిందని ఇది పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని అన్నారు. కార్యక్రమంలో రచయిత శ్రీ కళ్ళేపల్లి తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి