మంచిని ఎంచుకో:- సత్యవాణి
 ఎలక్షన్లట యేవేవో వొస్తున్నాయట
పార్టీలు టిక్కట్ల జాతర జరుపుతుందట
ఓటర్లూ జర జాగ్రత్త
చేతులు కలేకా ఆకులుపట్టుకొన్నవిధంకారాదు
రౌడీషీటర్లకు రాజకీయ ముసుగులు తొడిగి
రంగప్రవేశం చేయిస్తారు
జడ్. పి. టీ.సీ లంటూ
ఎమ్. పి. పి. టీ. సీ లంటూ
వెధవలకు పదవులు కట్టబెట్టి
ప్రజలపైకి ఉసికొల్పుతారు
కుసింత ౙానమున్న 
ప్రజలారా
తాంబూలాలిచ్చేసాం
తన్నుకు చవండి విధంగాక
టికట్ లు యిచ్చేకా
వ్యక్తులను బహిరంగపరచడం కాదు
మంచివాడు ఉత్తముడు సౌమ్యుడు
అంటూ అభ్యర్థలకు కితాబులిస్తారు
అలా ఓటర్లను నాయకులు
ప్రలోభపెట్టక మునుపే
టిక్కట్లు ఇవ్వకముందే
అభ్యర్థుల పేర్లు
బహిరంగపరచాలి వివిధ మాద్యమాలలోఅభ్యర్ధులపై ఎటువంటి
కేసులూలేవని
పార్టీ అధినేతలు
హామీపత్రం సమర్పించాలి పార్టీనాయకులు
వీరి పేర్లు రౌడీ షీటర్లుగా
పోలీస్ ఫైల్స్ లో నమోదుకాబడి లేదని
పోలీస్ స్టేషన్ ఆఫీసర్లుకూడా
పోటీచేసే అభ్యర్ధల పేర్లు
బహిరంగ ప్రకటన చేయాలి
ఎలక్షన్ ఆఫీసర్లుకూడా
పరిశీలన జరిపి 
మంచివాడు ఉత్తముడు మీ పవిత్రమైన ఓటును పొందుటకు అన్నివిధాలా ఇతడుఅర్హుడు
అని బహిరంగంగా
హామీ ఇవ్వాలి
కులమతాలెంచక
మనవాడు మంచివాడనే బ్రాంతిలోపడక
ఎన్నికలేవైనా
ఎంచి ఎంచి  మంచివారికే ఓటేద్దాం
ఏమరపాటును వదిలేద్దాం
        

కామెంట్‌లు