తెలంగాణ మాండలీకానికి ప్రాధాన్యత నిచ్చి
నిజాం పాలనలో ప్రజల జీవనశైలిని తెలిపి
నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా సోదరులు
కృష్ణమాచార్యతో కలసి పోరాడి
మొదట అధ్యాపకునిగా నైతికవిలువలు నేర్పి
భాగ్యనగరంలో మున్సిపల్ కార్పోరేషన్ లో పనిచేసి
చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం
రచనల ద్వారా సమాజానికి ప్రేరణ నిచ్చిన
దాశరథి రంగాచార్య
ప్రజాకవియే
చిల్లర దేవుళ్ళు రచన సినిమాగా చిత్రీకరించబడటం
ఆధ్యాత్మికత సనాతన ధర్మం సామాన్యునికి తెలియచేయాలని
శ్రీమద్రామాయణ0 ,మహాభారతం,
\చతుర్వేద సంహిత, దేవదాసు ఉత్తరాలు రచించి
నాలుగు వేదాలను తెలుగు లోనికి అనువదించి
తన ఆత్మకథను 'జీవనయానం' అన్న పేరుతో తెలియపరచిన
మీరు సాహితీకృషికి కళారత్న పురస్కారానికే
వన్నె తెచ్చిన సరస్వతీ మాత మానస పుత్రులే
అందుకోండి మీకివే నా అక్షారాంజలులు...!!
..........................
సరస్వతీ మానసపుత్రులు దాశరథి రంగాచార్య:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి