సహానుభూతి తరగతులు:- - యామిజాల జగదీశ్
 1993 నుండి డెన్మార్కులో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 6 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు వారానికొకసారి సహానుభూతి తరగతులకు తప్పనిసరిగా
హాజరు కావాలి. ఈ తరగతులు పిల్లలకు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, వాటి  ప్రాముఖ్యతను నేర్పడానికీ దోహదపడుతున్నాయి.  సహానుభూతిపై దృష్టి పెట్టడం ద్వారా, పాఠశాలల్లోని ప్రతి ఒక్కరిలోనూ మరింత కరుణ, సహాయక వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ తరగతులు డానిష్ సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. విద్యార్థులు ఒకరి దృక్కోణం నుండి విషయాలను చూడటం నేర్చుకోవడం వలన అవి పిల్లలలో మంచి మార్పును తీసుకువ స్తోంది. వారి మధ్య మంచితనం పెంపొందుతోంది. అనవసర భయం  తగ్గుతుంది. అపోహలు తొలగుతాయి. ఇతరులు ఏమి అనుభవిస్తున్నారోనని అర్థం చేసుకోవడం ద్వారా, పిల్లలు తమ తోటి వారిని దయ, గౌరవంతో చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారి అభిప్రాయం‌. సానుభూతిపై ప్రాధాన్యత వ్యక్తులకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని కూడా బలపరుస్తుందని వారి మాట.
ఫలితంగా, డెన్మార్క్ ప్రపంచంలోని అత్యంత దయగల దేశంగా నిలిచించింది. సానుభూతిని బోధించడంతో  పిల్లలు ఒకరితో ఒకరు ఎలా సంభాషించాలో అలవడుతుందంటారు. పిల్లలు మరింత అవగాహనతో కలిసిమెలసి ఉండటాన్ని ప్రోత్సహించడం ద్వారా, కరుణ, పరస్పర సహకారం విలువైన తరాన్ని పెంపొందిస్తోంది. ఇది ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి స
దోహదపడుతుందని నిర్వాహకుల మాట.

కామెంట్‌లు