ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనకదుర్గమ్మ తల్లీ నీకు వందనం…!
భక్తుల చుట్టూ
గోడలైన కంచుకోటలా కాచే
రక్షణ కవచమై నిలిచే...
ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనక దుర్గమ్మ తల్లీ నీకు వందనం…!
కష్టాల కారు మేఘాలను కరిగించే...
ఆకస్మిక ఆపదల వడగళ్లను తిప్పికొట్టే
బాధల అగ్నిగుండాన శీతలగాలులయ్యే
విజయాల గగనంలో ఎగిరే రెక్కలనిచ్చే
ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనక దుర్గమ్మ తల్లీ నీకు వందనం..!
సంసార ఊబిలో మునిగిన వారిని
దయామయమైన మీ హస్తంతో పైకిలాగే
సమస్యల సర్పాల్ని శూలంతో సంహరించే
నిన్ను భక్తితో స్మరించిన హృదయాలకు
ఆత్మజ్ఞాన కాంతిని...
ఆయురారోగ్య నిధిని...
అష్టైశ్వర్యాలను...సిరిసంపదలను...
శాంతి సౌభాగ్యాలను...ప్రసాదించే....
ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనక దుర్గమ్మ తల్లీ నీకు వందనం..!
చర్మచక్షువులతో గానరాని...
పంచేంద్రియాలతో గాంచలేని
మాటల వర్ణణకు అందని...
ఆ పరమాత్మ దివ్య స్వరూపివైన
ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనక దుర్గమ్మ తల్లీ నీకు వందనం…!
ఆయుధాలను ధరించి...
ఆపదల వర్షంలో నీడై నిలిచే...
భీషణ పరాక్రమవతి...
విఘ్నాలకు అధినాయకురాలు
మాలోని చెడు తలంపులను
శత్రువుల శిరస్సును ఛేదించే...
ఓ శివంకరీ..! శుభంకరీ..! భయంకరీ..!
ఓ కనక దుర్గమ్మ తల్లీ నీకు వందనం..!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి