పుర్రెల స్మారక చిహ్నం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 అందరూ చనిపోవాల్సిందే
తప్పించుకోలేరెవ్వరూ.
ముందు వెనుకలు అంతే.
ప్రారబ్దకర్మలే సూచికలై
ఉత్థాన పతనాలు.
జీవించి ఉన్నప్పుడు బ్రతకడానికి పోరాటాలు,
మరణంలో మూలాలతో సహా
నాశనాలు.
ఆహారసంపాదనం,మైథునం
సంసారసాగరంలో పెంపకం,
రాగం,ద్వేషం,మోహం,ఖేదం
సమ ఉజ్జీలై బాహుబలి బలిపీఠాలెక్కుతాయి.
జ్ఞానం,విచక్షణ,వియోగం,
సంయోగం,విజయం,
అపజయం,అహర్నిశల ఆరాటం,బ్రతుకుపోరాటంలో
నైవేద్యాలుగా సమర్పణం.
పుట్టుక,చావు మధ్యలో మహాభారతం,
భగవద్గీతే గరుడపురాణ వెలుగులో మార్గం చూపిస్తుంటే,
ప్రేమతత్వం,మానవత్వం కలగలువగల్గిన సత్యాలు.
అగ్నిసంస్కారంతో పవిత్రమై
ఆస్థిపంజరమే మిగిలి,
పుర్రెల స్మారకమై నిలిచింది.


(28 years Later ఆంగ్ల సినిమా చూసిన తర్వాత స్పందనగా)
కామెంట్‌లు