మా బాల్యంలో గ్రహణం రోజు:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-హైదరాబాద్.

 బాల్యంలో  గ్రహణం నాడు
ఆచారి గారింటి కెళ్ళి
గాయత్రి మామ్మ చెప్పినట్లు
ధర్భలు అడిగి మడిగా
అన్నింటి పైన వేసి
నాలుగు గంటలముందే
ఆహారం తినాలని 
ఆకలి లేకున్నా పెట్టేది
తాను పట్టు స్నానం చేసి
ఏవో మంత్రాలు చదువుతు
విడుపు స్నానం అందరిచేత చేయించేది
మొత్తం ఇల్లు కడిగి
దేముడిని తోమి తే గాని
అన్నం పెట్టేది కాదు
గ్రహణం సూతకం తో సమానం అనేది
అమ్మ,నాన్న ,అత్తయ్య మామయ్య ఆరుగురు పిల్లలం
స్నానాలు చేసి వంట పూర్తయ్యాక 
ఆచారిగారికి  దానం చేసి
భోజన తాంబూలాదులు పెట్టి పంపించడం జ్ఞాపకమే
మరి నేడో బహుళ అంతస్తుల భవనంలో
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విచ్చలవిడిగా
త్రాగుతు తింటు
ఏదైనా అంటే మీ చాదస్తం
అనే పిల్లలతో
డెబ్బది సంవత్సరాల వయస్సులో
గతకాలమే మేలు వచ్చు కాలం కంటెన్ అన్నట్లు 
బ్రతుకు వెళ్ళదీస్తున్నా...!!
.........................

కామెంట్‌లు